YCP: సిద్ధం సభలో ఏరులై పారిన మద్యం

కు వచ్చిన వారికి భారీగా మద్యం పంపిణి చేశారు. బస్సులోనే ఆహారం ప్యాకెట్లతోపాటు మద్యం అందజేశారు. తిరిగి వెళ్లే సమయంలో డబ్బు ఇచ్చేలా మాట్లాడి జనాల్ని తరలించారు. సభా ప్రాంగణం వద్ద కూడా వచ్చిన వారు బహిరంగంగానే మద్యం సేవించారు.మరోవైపు మేదరమెట్ల సిద్ధం సభలోనూ..... జగన్ అబద్ధాల విషపు జల్లు కురిపించారని... తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. హామీలు నిలబెట్టుకున్నానన్న జగన్ మాట పచ్చి అబద్ధమని మండిపడ్డారు. 85శాతం హామీలు అమలు చేయకుండా మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమానికి బడ్జెట్ లో జగన్ 15శాతం ఖర్చు చేయగా.. చంద్రబాబు 19శాతం ఖర్చు చేశారని గుర్తుచేశారు.
జగన్ కల 10 లక్షల కోట్ల దోపిడీ, జిల్లాకొక సొంత ప్యాలెస్ నిర్మాణమని ఆక్షేపించారు. ప్రజా విశ్వాసం కోల్పోయినందుకే... సభకు నిండా లక్ష మంది కూడా రాలేదన్నారు. మద్యపానాన్ని నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్..., మాట తప్పారని మండిపడ్డారు.మేదరమెట్ల వైసీపీ సిద్ధం సభలో అపశృతి చోటుచేసుకుంది. సభ ముగించుకొని తిరుగు ప్రయాణంలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా... మరొకరు సృహ తప్పి పడిపోయారు. సృహ కొల్పోయిన వ్యక్తిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుడు ఒంగోలు పురపాలక సంఘంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మురళిగా గుర్తించారు. ఈ సభకు వెళ్లి వస్తుండగా మరో యువకుడు మృతి చెందాడు. గోపాలపురం మలుపు వద్ద బస్సులో నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గేదెల బాలదుర్గగా గుర్తించారు. సభకు హాజరై తిరిగి వస్తుండగా బస్సు ముందు డోర్ వద్ద నిల్చొని ఉన్న బాలదుర్గ.. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. బస్సు వెనుక చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సభలో ఓ ఏఎస్సైకి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. "సిద్ధం" సభకు పిలిచినా రాలేదంటూ.. తనపై దాడి చేశారంటూ..జె.పంగులూరు మండలం రామకూరుకు చెందిన తలారి ధనచక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధం సభకు రమ్మని కొందరు వైకాపా నేతలు పిలిచారని... ధన చక్రవర్తి తెలిపారు. మిర్చి పంట కోసేందుకు కూలీలు వచ్చారని, సభకు రావడం కుదరదని చెప్పగా కొందరు వైసీపీ నేతలు తనను కులం పేరుతో దూషిస్తూ కర్రలు, రాడ్లతో విచక్షణరహితంగా కొట్టారని తెలిపారు. కుటుంబసభ్యులు తనను అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అక్కడ....... ప్రాథమిక చికిత్స తర్వాత ఒంగోలు రిమ్స్ కు వచ్చినట్టు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com