YCP: నమ్మించి గొంతు కోశారు

YCP: నమ్మించి గొంతు కోశారు
జగన్‌పై రాయదుర్గం ఎమ్మెల్యే వ్యాఖ్యలు... తాడేపల్లి ప్యాలెస్‌కు సెల్యూట్‌ చేసి వైసీపీకి గుడ్‌ బై చెప్పిన నేత

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. అధికార వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాడేపల్లి వచ్చిన తనకు టికెట్ ఇవ్వడం లేదని సజ్జల చెప్పారని కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. కనీసం జగన్ ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని.... ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వస్తే తమ జీవితాలు సర్వనాశనం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్యాణదుర్గం నుంచి తాను రాయదుర్గం నుంచి తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం.. తాడేపల్లి ప్యాలెస్ కు బయటినుంచి సెల్యూట్ చేసిన కాపు.... అక్కడి నుంచి వెనుదిరిగారు.

రాయదుర్గం నుంచి తన భార్య తప్పని సరిగా పోటీ చేస్తారని కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. "సీఎంను కలిసి మాట్లాడడం మాకు కుదరలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసే అవకాశం రాలేదు. ఇంత కన్నా అవమానం మాకు ఎప్పుడు జరగలేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సొంత నిర్ణయంతో స్వతంత్రంగా లేదా అవకాశం కల్పించిన ఏ పార్టీ అయినా పోటీకి సిద్దమని రామచంద్రారెడ్డి ప్రకటించారు. తమ ఇంటి నిండా లైట్ లు వేస్తే జగన్ ఫోటో లే కనబడతాయని... వైసీపీ పెట్టినప్పుడు ఐదేళ్లు పదవీకాలం వదులుకొని వచ్చానని తెలిపారు. 2014, 19లో పోటీ చేయను అన్నా మంత్రి పదవి ఇస్తాను అని పోటీ చేయించారని గుర్తు చేశారు. తమ జీవితాలు సర్వనాశనం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే పేరు చెప్పి తన గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరోవైపు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పులతో....... వైకాపాలో అసమ్మతి సెగ రేగింది. ఇన్నాళ్లూ పార్టీకోసం పని చేస్తే...... ఇప్పుడు ఎవరో కొత్తవారిని తీసుకువచ్చి సమన్వయకర్తలు అంటే సరేనంటూ తలలు ఊపేయాలా అంటూ నేతలు... తమ కేడర్‌తో నిర్వహించిన అంతర్గత భేటీల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు... తమ వర్గీయులతో ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టించి నిరసన వ్యక్తం చేయిస్తున్నారు. మరికొందరి వర్గీయులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

నియోజకవర్గాల మార్పు, టికెట్‌ నిరాకరణ సెగ జగన్‌కు తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు MLAలు...కాకినాడలోనిర్వహించిన సభకు మొహం చాటేశారు.పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. ఇద్దరూ కాకినాడలో జరిగిన సభకు దూరంగా ఉన్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. మాధవికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతునిచ్చేదే లేదని స్పష్టంచేస్తున్నారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఇన్చార్జిగా మాధవి నియామకాన్ని నిరసిస్తూ అరకు ఎంపీపీ ఉషారాణి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story