AP: మా నాన్నను కలవాలని ఉంది
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో పెళ్లి వ్యవహారంలో దువ్వాడ మొదటి భార్య కుమార్తెలు రోడ్డెక్కారు. నాన్నను కలవాలని ఉందంటూ దువ్వాడ ఇంటిముందు అర్ధరాత్రి దాకా పడిగాపులు పడ్డారు. అయినా వాళ్లను లోపలికి అనుమతించకపోవడంతో అర్ధరాత్రి సమయంలో అక్కడే ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దువ్వాడ ఇంటికి కుమార్తెలు హైందవి, నవీన వచ్చారు. వాళ్లను లోపలికి అనుమతించలేదు. చీకటి కావడంతో లైట్లు ఆర్పేశారు. రాత్రి సమయంలో అక్కడే ఆందోళనకు దిగారు. దివ్వెల మాధురి అనే మహిళతో తమ తండ్రి దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్‌గా ఉంటున్నారంటూ కుమార్తెలు సంచలన ఆరోపణలు చేశారు. ఏ హక్కుతో ఆమె తమ ఇంట్లో ఉంటోందని ప్రశ్నించారు.
ఆమె మాయలో పడిన నాన్న తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా వాళ్ల డాడీ దూరంగా ఉంటున్నాడని.. ఎన్ని మెసేజ్‌లు చేసినా, కాల్స్ చేసినా స్పందించడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో వివాదాలు బయటపడ్డాయి. టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్‌ను తొలగించి.. దువ్వాడ వాణిని జగన్ నియమించారు. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఏమైందో కానీ.. ఆ వెంటనే మళ్లీ టికెట్‌ను శ్రీనివాస్‌కు కేటాయించారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదని ఆ టైమ్‌లోనే బయటపడింది. ఈ క్రమంలోనే వేరే మహిళ వీళ్ల సంసారం మధ్యలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
నాకేం సంబంధం లేదంటున్న మాధురి
ఆంధ్రప్రదేశ్‌లై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రచ్చగా మారింది. దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వల మాధురికి ఎఫైర్ ఉందంటూ శ్రీనివాస్ భార్య వాణి సంచలన ఆరోపణలు చేశారు. దీనికి దివ్వల మాధురి కౌంటర్ ఇచ్చారు. తనను అనవసరంగా బయటకు లాగొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.. శ్రీనివాస్ భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. క్యారెక్టర్ లేని మహిళగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దువ్వాడ వ్యవహారం వారి కుటుంబానికి సంబంధించినదని... వారితోనే తేల్చుకోవాలని సూచించారు. కానీ, తనను మధ్యలోకి లాగొద్దని మాధురి అన్నారు.. దువ్వాడ వాణి తన భర్తను వద్దనుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన మాధురి.. అసెంబ్లీ టిక్కెట్ తనకే ఇవ్వాలని వైఎస్ జగన్‌ను కలిశారని చెప్పుకొచ్చారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ దశలో దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ఓ ఫ్రెండ్, ఫీలాసపర్ ఇంకా అన్నీ అని చెప్పుకొచ్చారు. ఆయన చాలా నిజాయతీ పరుడని మాధురి ప్రశంసించారు..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com