AP : విచ్చలవిడి పోస్టులు.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్

YCP సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జగన్ హయాంలో ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా అసభ్యకర పోస్టులు పెట్టిన రవీందర్‌రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఆ తంతు కొనసాగిస్తూనే ఉన్నారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి … రవీందర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనితపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఎన్నికల సమయంలో షర్మిల , సునీతా రెడ్డిపైనా పలు వ్యక్తిగత విమర్శలు చేశారు. చివరకు జగన్ తల్లి విజయమ్మనూ వదల్లేదు. తీవ్ర మనస్తాపానికి లోనైన షర్మిల, సునీత అప్పట్లో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేశారు. షర్మిల పుట్టుకపైనా పలు వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టి వైరల్ చేశారు. ఆయనపై మంగళగిరి, హైదరాబాద్‌లో పలు కేసులున్నాయి. పులివెందులలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపకు తీసుకొచ్చి విచారిస్తున్నారని సమాచారం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com