YCP: వైసీపీ యూటర్న్..అమరావతికి జై

YCP: వైసీపీ యూటర్న్..అమరావతికి జై
X
అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలన.. వైసీపీ ఏపీ కో ఆర్డినేటర్ సజ్జల కీలక ప్రకటన... ఎన్నికల ప్రచారం నాటి ప్రకటనపై యూటర్న్... గత ఎన్నికల దెబ్బకు రూటు మార్చిన వైసీపీ

ఏపీ­లో గత వై­సీ­పీ ప్ర­భు­త్వం­లో అమ­రా­వ­తి స్ధా­నం­లో మూడు రా­జ­ధా­నుల ఏర్పా­టు కోసం తీ­వ్రం­గా ప్ర­య­త్నా­లు చేసి వి­ఫ­ల­మైన జగన్.. గత ఎన్ని­క­ల్లో ఓటమి తర్వాత రూ­టు­మా­ర్చా­రు. అమ­రా­వ­తి­లో రా­జ­ధా­ని ఏర్పా­టు వి­ష­యం­లో ప్ర­భు­త్వ ప్ర­య­త్నా­ల­పై వి­మ­ర్శ­లు కూడా చే­శా­రు. అయి­తే ఇప్పు­డు రా­జ­ధా­నుల వి­ష­యం­లో వై­సీ­పీ పూ­ర్తి­గా యూ­ట­ర్న్ తీ­సు­కుం­ది. ఈ మే­ర­కు వై­సీ­పీ కీలక నేత సజ్జల రా­మ­కృ­ష్ణా­రె­డ్డి ఇవాళ సం­చ­లన ప్ర­క­టన చే­శా­రు. ఓ డి­జి­ట­ల్ మీ­డి­యా కాం­క్లే­వ్ లో పా­ల్గొ­న్న వై­సీ­పీ రా­ష్ట్ర సమ­న్వయ కర్త సజ్జల రా­మ­కృ­ష్ణా­రె­డ్డి రా­జ­ధా­ని­పై కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. వై­సీ­పీ­కి మూడు రా­జ­ధా­ను­లు ఆలో­చన లే­ద­ని ఆయన తే­ల్చి­చె­ప్పే­శా­రు. జగన్ అమ­రా­వ­తి నుం­డే పరి­పా­లన సా­గి­స్తా­ర­ని సజ్జల తె­లి­పా­రు. వై­సీ­పీ ప్ర­భు­త్వం ఏర్ప­డిన వెం­ట­నే రై­తుల ప్లా­ట్స్ అభి­వృ­ద్ధి చేసి ఇస్తా­మ­ని ప్ర­క­టిం­చా­రు. ఖర్చు తగ్గిం­చి బ్ర­భు­త్వం­పై భారం తగ్గి­స్తూ గుం­టూ­రు-వి­జ­య­వాడ మధ్య మహా నగర ని­ర్మా­ణా­ని­కి కృషి చే­స్తా­మ­ని సజ్జల ప్ర­క­టిం­చా­రు.

"వై­సీ­పీ మళ్లీ అధి­కా­రం­లో­కి వస్తే, అమ­రా­వ­తి రా­జ­ధా­ని­గా కొ­న­సా­గు­తుం­ది. ము­ఖ్య­మం­త్రి YS జగన్ మో­హ­న్ రె­డ్డి తా­డే­ప­ల్లి­లో­నే ని­వ­సి­స్తా­రు, వి­శా­ఖ­ప­ట్నం­కు వె­ళ్ల­రు" అని వ్యా­ఖ్యా­నిం­చా­రు. గతం­లో వి­శా­ఖ­ప­ట్నం­కు మా­రా­ల­ని ఆలో­చిం­చా­మ­ని, కానీ అది సా­ధ్యం కా­లే­ద­న­న్నా­రు. మూడు రా­జ­ధా­ను­ల­ను ప్ర­జ­లు వద్ద­న్నా­ర­ని అం­దు­కే తాము పు­న­రా­లో­చి­స్తు­న్నా­మ­న్నా­రు. "లక్షల కో­ట్ల అప్పు­లు చేసి అమ­రా­వ­తి కట్ట­డా­ని­కి మేము వ్య­తి­రే­క­మే. బె­జ­వాడ-గుం­టూ­రు మధ్య రా­జ­ధా­ని ని­ర్మి­స్తే రెం­డు నగ­రా­లు బాగా అభి­వృ­ద్ధి చెం­దే­వి" అని సజ్జల వ్యా­ఖ్యా­నిం­చా­రు. టీ­డీ­పీ ప్ర­భు­త్వం అమ­రా­వ­తి అభి­వృ­ద్ధి పే­రు­తో చం­ద్ర­బా­బు నా­యు­డు తన అను­చ­రు­ల­కు మా­త్ర­మే ప్ర­యో­జ­నం చే­యా­ల­ని కు­ట్ర పన్నా­రు. మేము మళ్లీ రా­జ­కీ­యం­లో­కి వస్తే, అమ­రా­వ­తి ప్రా­జె­క్ట్‌­ను పరి­శీ­లి­స్తా­ము, కానీ రా­జ­ధా­ని భా­వ­న­ను మా­ర్చ­కుం­డా ప్ర­జల అభి­వృ­ద్ధి­కి ఉప­యో­గ­ప­డే­లా చే­స్తా­మ­ని చె­ప్పా­రు. దీం­తో అమ­రా­వ­తి రై­తు­ల­కు వై­సీ­పీ తీపి కబు­రు అం­దిం­చిం­ది.

రాజకీయాల్లో హాట్‌ టాపిక్

అమ­రా­వ­తి నుం­చే వై­సీ­పీ ప్ర­భు­త్వ పాలన అంటూ సజ్జల చే­సిన వ్యా­ఖ్య­లు ఇప్పు­డు ఏపీ రా­జ­కీ­యా­ల్లో హాట్ టా­పి­క్ గా మా­రా­యి. ఇప్ప­టి­దాక వై­సీ­పీ పా­ర్టీ, ఆ పా­ర్టీ అధి­నేత, మాజీ సీఎం జగన్ మూడు రా­జ­ధా­నుల వి­ధా­నా­న్ని నె­త్తి­కె­త్తు­కు­న్న సం­గ­తి తె­లి­సిం­దే. పరి­పా­ల­న­ను, అభి­వృ­ద్ధి­ని వి­కేం­ద్రీ­క­రిం­చ­డం ద్వా­రా అన్ని ప్రాం­తా­లు, ఆ ప్రాం­తా­ల్లో­ని ప్ర­జ­లు సమ­గ్రం­గా అభి­వృ­ద్ధి చెం­దా­ల­నే­ది వై­సీ­పీ వి­ధా­నం అంటూ.. విశాఖ­పట్టణాన్ని పరి­పా­లన రా­జ­ధా­ని­గా, అమ­రా­వ­తి­ని శాసన రా­జ­ధా­ని­గా, కర్నూ­లు­ను న్యాయ రా­జ­ధా­ని­గా వై­సీ­పీ ప్ర­భు­త్వం చట్టం చే­య­డం..దీ­ని­ని వ్య­తి­రే­కి­స్తూ టీ­డీ­పీ వర్గీ­యు­లు కో­ర్టు­కె­ళ్లా­రు. వై­సీ­పీ 2019 ఎన్ని­క­ల­కు ముం­దు రా­జ­ధా­ని­ని మా­ర్చ­బో­మ­ని ప్ర­జ­ల­కు హామీ ఇచ్చిం­ది. 2024అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో టీ­డీ­పీ కూ­ట­మి సా­ర­ధి­గా చం­ద్ర­బా­బు తన ప్ర­చా­రం­లో అమ­రా­వ­తి రా­జ­ధా­ని సమ­స్య­ను ప్ర­చా­రా­స్త్రం­గా మలి­చా­రు. 2014లోనే అమ­రా­వ­తి­ని ఎం­పిక చే­శా­మ­ని, 2019 వరకు ని­ర్మా­ణా­లు ప్రా­రం­భిం­చ­గా వై­సీ­పీ అధి­కా­రం­లో­కి వచ్చిన తరు­వాత ని­ర్వీ­ర్యం చే­సిం­ద­న్నా­రు. మా­ర్చి­లో వై­సీ­పీ సీ­ని­య­ర్ నేత, మాజీ మం­త్రి బొ­త్స సత్య­నా­రా­యణ మూడు రా­జ­ధా­నుల వి­ధా­నా­ని­కి కాలం చె­ల్లిం­ద­ని.. మళ్లీ పా­ర్టీ­లో చర్చి­స్తా­మ­ని ప్ర­క­టన చే­శా­రు. ఈ క్ర­మం­లో తా­జా­గా వై­సీ­పీ రా­ష్ట్ర కో ఆర్డి­నే­ట­ర్ సజ్జల రా­మ­‌­కృ­ష్ణా­రె­డ్డి మూడు రా­జ­ధా­నుల ఆలో­చన లే­ద­ని..ఇక నుం­చి వై­ఎ­స్.జగన్ మో­హ­న్ రె­డ్డి అమ­రా­వ­తి నుం­డే పరి­పా­లన సా­గి­స్తా­రు అని చే­సిన ప్ర­క­ట­న­తో ఏపీ­లో రా­జ­ధా­ని అం­శం­లో గం­ద­ర­గో­ళా­ని­కి తె­ర­ప­డి­న­ట్లే­న­ని భా­వి­స్తు­న్నా­రు.

Tags

Next Story