ఆఫ్రికాలో వైసిపి కల్తీ మద్యం దందా.. అక్కడ కూడానా..!

ఆఫ్రికాలో వైసిపి కల్తీ మద్యం దందా.. అక్కడ కూడానా..!
X

వైసిపి అరాచకాలు ఏ స్థాయిలోకి వెళ్ళాయంటే.. కల్తీ మద్యం పేరుతో వందల కోట్లు సంపాదించుకొని.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. వైసిపి నేతల ఆగడాలు బట్టబయలు అవుతున్నా జగన్ యాక్షన్ తీసుకున్న పాపాన పోలేదు. కానీ ములకలచెరువులో కల్తీ మద్యం తయారు కేంద్రం వెనుక టిడిపి నేత జయచంద్రా రెడ్డి ఉన్నాడని తెలియడంతో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. కానీ జగన్ నుంచి ఇలాంటి యాక్షన్ మనం ఊహించగలమా.. అసలు కల్తీ మద్యం అనేది తమ డిక్షనరీలోనే లేదు అన్నట్టు బిల్డప్ ఇచ్చే జగన్.. రీసెంట్ గానే ఆఫ్రికా సెంటర్లో ఉండే కామెరూన్ దేశంలో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ద్వారా వైయస్ అనిల్ రెడ్డి, వైయస్ సునీల్ రెడ్డి కల్తీ మద్యం వ్యాపారం నిర్వహించారు. కామెరూన్ దేశంలో నిషేధించబడ్డ సాచెట్ విస్కీని అమ్మడంతో అక్కడ వందల మంది కామెరూన్ దేశస్తులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి.

ఇంటర్నేషనల్ పత్రికల్లో, అంతర్జాతీయ మీడియా ఛానల్లో పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. చివరకు డబ్లు హెచ్ ఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కంపెనీ ద్వారా వైయస్ అనిల్ రెడ్డి, వైయస్ సునీల్ రెడ్డి వేల కోట్లు సంపాదించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. కానీ వాటి గురించి జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కామెరూన్ దేశంలో ఈ ఇండియన్ కంపెనీని మూసివేయాలంటూ చదువుకున్న వారు మేధావులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయినా సరే వీళ్లు మాత్రం తమ మద్యం వ్యాపారం ఆపలేదు. చివరకు కామెరూన్ ప్రభుత్వంలో మైన్స్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఏకంగా ఆర్మీ ని తీసుకువెళ్లి ఈ రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ కంపెనీకి సీల్ వేయించారు. ఇంటర్నేషనల్ మీడియాతో ఇదే కంపెనీ ముందు నిలబడి ఆయన మాట్లాడారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఆ వీడియోలు, ఫోటోలలో చాలా స్పష్టంగా రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అనే పేరు కనిపిస్తుంది. ఈ ఇండియన్ కంపెనీ నిషేధించబడ్డ సాచెట్ విస్కీ అమ్మడం వల్ల వందల మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా.. యూత్, చిన్నపిల్లలు దీనికి బానిసలుగా మారుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ కంపెనీని మూసివేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మరి ఈ విషయంపై జగన్ ఎప్పుడైనా మాట్లాడారా. ఆ విస్కీని సరఫరా చేస్తుంది ఎవరో కూడా జగన్ కు తెలుసు. ఆరోపణలు వస్తేనే జయచంద్రా రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు. కానీ జగన్ మాత్రం కళ్ళ ముందు ఆధారాలు కనిపిస్తున్నా సరే అరెస్ట్ అవుతున్నా సరే తన పార్టీ నేతలపై ఒక్క యాక్షన్ తీసుకున్నది లేదు. పైగా కల్తీ మద్యం అంటేనే తమకు తెలియదున్నట్టు.. అక్కడికి ఏదో వైసీపీ నేతలు అందరూ మంచివారే అన్నట్టు జగన్ చెప్పుకోవడం ఆయన విజ్ఞతకే చెందుతుంది.

Tags

Next Story