మెడికల్ కాలేజీలపై వైసీపీ మాయ.. ఎంత మోసం..

వైసీపీ బ్యాచ్ మెడికల్ కాలేజీల విషయంలో చేస్తున్న ఫేక్ ప్రచారం చూస్తుంటే ఎవరైనా నమ్మేయాల్సిందేనేమో. ఎందుకంటే వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను కట్టేసి.. వాటిలో స్టూడెంట్లు చదువుకుని బయటకు వచ్చేస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటిని ప్రైవేటైజేషన్ చేస్తుందన్న రేంజ్ లో వాళ్ల ప్రచారం ఉంది. వింటే ఎవరైనా నమ్మేస్తారేమో. కానీ అసలు నిజం ఏంటనేది కళ్ల ముందే ఉంది. మొన్న జగన్ వెళ్లిన మెడికల్ కాలేజీ కూడా పిల్లర్ల స్టేజ్ లోనే ఆగిపోయింది. ఒకటి రెండు తప్ప ఏ ఒక్క కాలేజీ పూర్తి కాలేదు. అయితే జగన్ ఇప్పుడు చెబుతున్న పీపీపీ విధానం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిందేమీ కాదు.
గతంలో జగన్ హయాంలోనే 19 07 2023లోనే జీవో ఎం ఎస్ నెంబర్ 107 తీసుకొచ్చింది. ఇందులో 15 సీట్లు ఆల్ ఇండియా కేటగిరీలో, 50 సీట్లు కన్వీకనర్ కోటాలో, 35 సీట్లు సెల్ ఫైనాన్స్ సీట్ల కింద ఇచ్చేశారు. ఆల్ ఇండియా అంటే దాన్ని ఎన్నారై కోటా కింద ఇచ్చేస్తున్నారు. ఎన్నారై, సెల్ ఫైనాన్స్ అంటే ఇవి ప్రైవేటైజేషనే కదా. సెల్ ఫైనాన్స్ కోటాలో రూ.12 లక్షలకు, ఎన్నారై కోటాలో రూ.24 లక్షలకు సీట్లు అమ్మేసుకున్నట్టే కదా. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఇందులో చేసిందేమీ లేదు. ఆ పద్ధతినే కంటిన్యూ చేస్తున్నారు కదా. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రులు అధ్వానంగా ఉన్నాయి. అందుకే పీపీపీ పద్ధతిలో ఈ మెడికల్ కాలేజీలను డెవలప్ చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
అనపర్తి దగ్గర జేగూరు పాడు విద్యుత్ కేంద్రం 33 ఏళ్ల పాటు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ భాగస్వామ్యంలో నడిచి ఇప్పుడు ప్రభుత్వ పరం అయింది. పీపీపీ పద్ధతిలో కొన్నాళ్ల పాటు ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది. ప్రతి హాస్పిటల్ లో సెపరేట్ బెడ్స్, డాక్టర్లు ఉంటారు. వాళ్లు కొన్నాళ్ల పాటు మెయింటేన్ చేసి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తారు. ఇందులో పేమెంట్ చేసేవాళ్లకు సెపరేట్ బెడ్స్ ఉంటాయి. అలాగే ఆరోగ్య శ్రీ కూడా ఉంటుంది. కాబట్టి పేదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పైగా కేంద్రం ఇచ్చిన రూ.1900 కోట్లలో రూ.1500 కోట్లు కూడా వీళ్లు ఖర్చు చేయలేదు. సెంట్రల్ ఇచ్చిన నిధులను సరిగ్గా వినియోగించుకున్నట్టు అయితే మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తయ్యేవేమో. కానీ ఆయన అలా చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆస్పత్రులను అద్భుతంగా తీర్చిదిద్ది డబ్బున్న వారు, పేదవారికి ఒకే దగ్గర హెల్త్ ట్రీట్ మెంట్ ఇప్పించాలి అనుకుంటే తప్పేముంది అని అడుగుతున్నారు ఏపీ ప్రజలు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com