డేటా సెంటర్ పై వైసీపీ తప్పుడు ప్రచారాలు.. నిజాలు ఇవే..

విశాఖలో వస్తున్న గూగుల్ డేటా సెంటర్ పై వైసీపీ తప్పుడు ప్రచారాలు అప్పుడే మొదలు పెట్టింది. అసలు ఏపీ అభివృద్ధి కావడం వాళ్లకు నిజంగా ఇష్టం లేనట్టే ఉంది. వాళ్ల హయాంలో ఒక్క కంపెనీ కూడా రాలేదు. పైగా ఉన్న కంపెనీలను కూడా అదరగొట్టి బెదరగొట్టి వెళ్లిపోయేలా చేశారు. ఏపీలో ఒక్క పెట్టుబడి లేకుండా.. ఒక్క జాబు కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ వద్దు అని ప్రజలు కూటమికి జై కొడితే.. అందుకు తగ్గట్టే కూటమి ఎప్పుడు వరుసగా పెట్టుబడులు తీసుకొస్తోంది. ప్రపంచంలోనే దిగ్గజ సంస్థ గూగుల్ తన డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అంత పెద్ద సంస్థ లక్ష 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడం నిజంగా ఏపీకే గర్వకారణం. కానీ వైసీపీ ఏం చేస్తుంది.. గూగుల్ డేటా సెంటర్ కు అప్పనంగా భూములు ఇస్తున్నారని.. పెద్దగా జాబులు క్రియేట్ కావని.. పైగా వాతావరణం దెబ్బతింటుంది అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తోంది. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా ఒక అర్థం ఉంటుంది.. కానీ గూగుల్ డేటా సెంటర్ ఆరోపణలు చేస్తే వైసిపి కి వచ్చిన లాభమేంటి.. అంటే అంత పెద్ద కంపెనీ కూటమి ప్రభుత్వంలో వస్తే సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పేరు వస్తుందనే కదా. కానీ గూగుల్ డేటా సెంటర్ వస్తే జరిగే లాభాలు చాలా ఎక్కువ.
విశాఖకు ఒక డేటా సెంటర్ వస్తే.. దాన్ని చూసి మరిన్ని డేటా సెంటర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డేటా సెంటర్లు ఒక ప్రాంతంలో క్లస్టర్ లాగా ఏర్పడతాయి. అతిపెద్ద డేటా సెంటర్ అయిన గూగుల్ వచ్చాక.. మిగిలిన డేటా సెంటర్లు కూడా ఇక్కడికే వస్తాయి. దానివల్ల డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా కొన్ని వేల జాబులు క్రియేట్ అవుతాయి. గూగుల్ డేటా సెంటర్ ను ఆపరేట్ చేయడానికి, అందులో పని చేయడానికి టెక్ జాబర్లు, ఇన్సైడ్ స్టాఫ్, అవుట్ సైడ్ స్టాఫ్ ఇలా కొన్ని వేలమంది కావాలి. ఈ డేటా సెంటర్లో పనిచేసే వేల మందికి అవసరమైన ఫెసిలిటీస్ కల్పించేందుకు చుట్టూ కొన్ని బిజినెస్ లు స్టార్ట్ అవుతాయి. ఆ బిజినెస్లలో పనిచేయడానికి మరింతమందికి జాబులు వస్తుంటాయి. ఇలా విశాఖలో జాబుల జాతర సాగుతుంది. గూగుల్ డేటా సెంటర్ వస్తే వాతావరణం పాడవుతుంది అంటూ వైసీపీ ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. వాస్తవానికి గూగుల్ డేటా సెంటర్ వస్తే ఎలాంటి హీట్ పెరగదు. నార్మల్ టెంపరేచర్ కంటే డేటా సెంటర్లో ఇంకా కూల్ గా ఉంటుంది.
పైగా గూగుల్ డేటా సెంటర్ వల్ల న్యూ వాటర్ రిసోర్స్ సెంటర్లు పెరుగుతాయి. అంతేగాని ఆల్రెడీ ఉన్న వాటర్ ను అది పొల్యూట్ చేయదు. డేటా సెంటర్ ను కూల్ గా ఉంచడానికి మనం రెగ్యులర్ గా వాడే వాటర్ సరిపోతుంది. పైగా కొత్త పవర్ సెంటర్లు కూడా పెరుగుతాయి. దానివల్ల అటు వాటర్ గాని ఇటు పవర్ కు గాని ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
మొత్తంగా చూస్తే గూగుల్ డేటా సెంటర్ వల్ల కలిగే లాభాలే ఎక్కువగా ఉన్నాయి తప్ప నష్టాలు పెద్దగా లేవు. కానీ వైసీపీ మాత్రం ఇవేవీ తెలియకుండా అవాకులు చవాకులు పేలుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గూగుల్ డేటా సెంటర్ అర్జెంటుగా వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అన్నట్టు వైసిపి ఆలోచనలు ఉన్నాయి. ఇంత దుర్మార్గంగా ఆ పార్టీ ఆలోచిస్తుంది కాబట్టి ఏపీ యువత భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది వైసీపీ ప్రభుత్వ సమయంలో. ఇప్పుడు కూటమి చక్కదిద్దాలని భావిస్తుంటే అంతో ఇంతో సపోర్ట్ చేయాల్సింది పోయి.. పెట్టుబడులు రాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం ఏంటి. అందుకే ఇప్పుడు వైసీపీని యువత విమర్శిస్తోంది. గూగుల్ డేటా సెంటర్ చుట్టూ కూటమి ప్రభుత్వ ఆలోచనలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రపంచంలోనే మేటి కంపెనీ విశాఖకు వస్తే దాన్ని చూసి ఇంకో పది కంపెనీలు వస్తాయన్నది చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆలోచన. ఫ్యూచర్ ను ఊహించారు కాబట్టే ఇలాంటి కంపెనీలను తీసుకువస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com