Andhra Pradesh News: నాడు సంక్షోభం.. నేడు సంక్షేమం-అభివృద్ధి బాటలు

ఏపీలో ప్రజారాజధాని అమరావతిలో వైసీపీ హయాంలో సంక్షోభం మాత్రమే ఉండేది. కానీ నేడు కూటమి ప్రభుత్వం అమరావతిలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరులుగు పెట్టిస్తోంది. అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండూ మేనేజ్ చేయడం చాలా కష్టమే. ఎందుకంటే ఏపీ ఆర్థిక పరిస్థితిని జగన్ ధ్వంసం చేశాడు. అమరావతిలో ఒక్కటంటే ఒక్క దీపం కూడా వైసీపీ హయాంలో వెలగలేదు. వాళ్ల టైమ్ లో చీకటే తప్ప వెలుతురు లేదు. కానీ కూటమి అలా కాకుండా అమరావతిని ప్రపంచంలోనే మేటిగా తీర్చిదిద్దాలని అహర్నిషలు కష్టపడుతోంది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్, లోకేష్ పెట్టుబడుల కోసం నిత్య ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
దానికి నిదర్శనంగానే ఇప్పుడు ఏపీలో ఏరోస్పేస్ పెట్టుబడుల కోసం లోకేష్ పట్టుబట్టారు. ఎయిర్ బస్సుల కోసం పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతిలో వైసీపీ టైమ్ లో 34వేల ఎకరాలను లాక్కునే ప్రయత్నం చేశారు. అందుకే రైతులు తిరగబడ్డారు. ఇప్పుడు కూటమి వచ్చాక అక్కడ అన్ని రకాల పనులు జరుపుతోంది. అందుకే ప్రజలకు ఇప్పుడు నమ్మకం వచ్చింది. 1850 ఎకరాలు తీసుకునేందుకు కూటమి రైతులు, ప్రజలతో చర్చలు జరుపుతోంది. ప్రజలు కూడా ఇస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు హామీ ఇచ్చారంటే కచ్చితంగా పూర్తి చేస్తారని వాళ్లకు తెలుసు. అందుకే చంద్రబాబు ప్రభుత్వానికి ఎలాంటి నిరసనలు రావట్లేదు.
రాజధాని అమరావతిలో ఉన్న సెంటు భూములను కాజేసేందుకు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడు మాజీ సీఎం జగన్. కానీ ఇప్పుడు కూటమి అసైన్డ్ ల్యాడ్ రైతులు గానీ, పట్టాల్యాండ్ రైతులు గానీ ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా సానుకూలంగా ఉంది. వారికి అందాల్సిన పరిహారంతో పాటు.. అమరావతిని అభివృద్ధి చేసి చూపించే పనులు జోరుగా సాగుతున్నాయి. అమరావతికి ఇంటర్నేషనల్ కంపెనీలు రావడమే ఇందుకు నిదర్శనం. వైసీపీ టైమ్ లో ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం ఆలోచిస్తోంది. 296663 మందికి రూ.436 కోట్ల రూపాయలు వాహన మిత్ర కింద ఇస్తున్నాం. ఇది ఇవ్వని హామీ. హామీ ఇవ్వకపోయినా సరే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. ప్రభుత్వానికి భారమైనా కూటమి ఇచ్చేందుకు సిద్ధపడింది. మరి దీనిపై వైసీపీ ఎందుకు స్పందించట్లేదో వారికే తెలియాలి.
వైసీపీ సంక్షేమం పేరుతో అభివృద్ధిని ధ్వంసం చేసింది. అమరావతిలో ఇటుక కూడా కట్టలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తోంది. ఎక్కడ చిన్న తప్పు జరిగినా సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందిస్తున్నారు. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన వార్నింగ్ లు ఇస్తూ చిన్న మచ్చ లేకుండా చూస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, పొలిటికల్ మేనేజ్ మెంట్ తెలిసిన వ్యక్తి నేడు సీఎంగా ఉన్నారు కాబట్టి ఏపీకి ఢోకా లేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com