AP : మా అన్న పార్టీకి ఓటేయొద్దు: వైఎస్ సునీత

వచ్చే ఎన్నికల్లో తన అన్న, సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పార్టీకి ఓటేయొద్దని వైఎస్ సునీత (YS Sunitha) కోరారు. 'హత్యా రాజకీయాలు చేసేవారు పాలించకూడదు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ గెలిస్తే ప్రజలకు కష్టాలే. నా తండ్రి వివేకా హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ చేయాలి. ఆయన నిర్దోషి అయితే వదిలేయాలి. సినిమాల్లోలాగా హంతకులు మన మధ్య ఉంటారు. కానీ మనం మాత్రం రియలైజ్ కాలేం. సీబీఐ దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలి' అని ఆమె పేర్కొన్నారు.
సీబీఐపై ఎలాంటి ఒత్తిడి ఉందో తనకు తెలియదని.. ఎవరో అడ్డుపడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా తాను ఆరోపణలు చేయకూడదన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కష్ట సమయంలో తమకు అండగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపారు సునీత.
లాయర్లు, తోటి డాక్టర్లు, మరికొందరు స్నేహితులు, సన్నిహితులు మద్దుతగా నిలబడ్డారని.. తాను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య గురించి అడుగుతున్నారని.. ఎంతోమంది రాజకీయ పార్టీ నేతలు తనకు చాలా అండగా ఉన్నారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com