NTR Bharosa : వైఎస్సార్ పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసాగా మార్పు

NTR Bharosa : వైఎస్సార్ పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసాగా మార్పు

వైఎస్సార్ పెన్షన్ ( YSR Pension ) కానుక పథకం పేరును టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాగా ( NTR Bharosa ) మార్చింది. 2014-19 మధ్య పెట్టిన పేరునే కొనసాగించనుంది. ఇకపై వృద్ధులకు రూ.4,000 పెన్షన్ అందనుంది. ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేస్తున్నందున జులై 1న రూ.7,000 ఇస్తుంది. దివ్యాంగులకు రూ.6వేలు అందనుంది. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్‌దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ ఐవీ బాధితులు, కళాకారులకు ప్రతీనెల రూ.3వేలు పింఛన్ అందుతుంది.

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు)

దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు)

కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000

కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ₹10,000(గతంలో ₹5వేలు)

మంచానికి పరిమితమైనవారికి ₹15,000(గతంలో ₹5వేలు)

Tags

Next Story