YSRCP Bus Yatra: వైసీపి బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్.. జనం రాకపోవడంతో..

YSRCP Bus Yatra: వైసీపి బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్.. జనం రాకపోవడంతో..
YSRCP Bus Yatra: వైసీపి బస్సు యాత్రకు భారీ జన సమీకరణ కోసం నేతలు తలలు పట్టుకుంటున్నారు.

YSRCP Bus Yatra: వైసీపి బస్సు యాత్రకు భారీ జన సమీకరణ కోసం నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇవాళ కర్నూలు జిల్లాలో వైసీపీ మంత్రల బృందం పర్యటించనుంది. అయితే ఇది మంత్రులు బుగ్గన, గుమ్మనూర్ జయరాం.. నంద్యాల వైసీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డికి పెద్ద ఛాలెంజ్‌గా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో తమ బస్సు యాత్రకు జనం రాకపోతే పరువు పోతుందని నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారట.

భారీగా జన సమీకరణ కోసం ఇప్పటికే కర్నూలు, నంద్యాల జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెలకు, పార్టీ ఇన్‌చార్జీలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయట. పొదుపు మహిళలు, రైతులు, కూలీలు అందరినీ కర్నూలుకి రప్పించాలని సూచించారట. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపి దిగువ స్థాయి మండల గ్రమ నేతలు వాహణాల్లో జనాలను కర్నూలుకి పెద్ద ఎత్తున తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట.

ఎవరైనా రాకపోయినా తమ మాట వినకపోయినా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చిరిస్తున్నారట. ఇక అన్నింటికీ మించిన పెద్ద ప్లాన్ ఏంటంటే.. భారీ జనంతో బస్సు యాత్రకు అనూహ్య స్పందన వచ్చినట్లు చూపించడానికి వాహణాల రద్దీ, ప్రజల రాకపోకలు అధికంగా ఉండే రద్దీ ప్రాతంలో సభ పెట్టాలని నిర్ణయించుకున్నారట. నంద్యాల వైపు నుంచి బస్సు యాత్ర కర్నూలు నగరంలోకి వస్తే.. సి.క్యాంప్ సెంటర్ లో సభ పెట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.

సి.క్యాంప్ సెంటర్ అంటే.. విజయవాడ, తిరుపతి, బెంగుళూర్ జాతీయ రహదారులని కలిపే సర్కిల్. ఇక్కడ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సర్కిల్ అతి పెద్దగా ఉంటుంది. పైగా ఆర్టీసి బస్సులు నిలిపే ప్రధాన బస్ స్టాఫ్, పక్కనే రైతు బజార్ ఉంటుంది. ఇక్కడ ఆటోలు ఆగినా, ఆర్టీసి బస్సులు ఆగినా రోడ్డు మొత్తం స్థంబించి పోతుంది.

అదే వైసీపీ నేతల బస్సు వచ్చి అక్కడ సభ పెడితే లీడర్లు వారు అనుచరులు వచ్చిన వాహణాలతో పాటు భారీగా ముఖ్యమైన మూడు రహదారుల నుంచి వాహనాలు నిలిచిపోయి ట్రఫిక్ స్తంభించి పోతుందింది. దాని వలన సభకు ప్రజల నుంచి ఊహించని స్పందన వచ్చినట్లు కనిపిస్తుందని ప్రణాళిక సిద్దం చేసుకున్నారట. మొత్తానికి మంత్రుల బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువయ్యింది. దీంతో ఆయా నియోజకవర్గాల నుంచి జనాలను కర్నూలుకి తరలించేందుకు క్యాడర్ తలమునకలువుతోందట.

Tags

Read MoreRead Less
Next Story