Andhra Pradesh : రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయింది.. చంద్రబాబు

రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా ఆ పార్టీకి దొరకడం లేదని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు (Chittoor) ఉమ్మడి జిల్లా పీలేరులో జరిగిన రా..కడలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 'సిద్దం' అంటూ ఐదేళ్లుగా దోచుకున్న డబ్బుతో జగన్ రెడ్డి (Jagan) ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అందుకే వైసీపీని (YCP) ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. రైతులు, యువకులు, మహిళలు, విద్యార్థులు, సమాజంలోని అన్ని వర్గాల ఉద్యోగులు జగన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ ప్రజలకు అవసరమా? యుద్ధం ప్రారంభమైంది, మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధంగా ఉన్నారా? రాబోయే కురుక్షేత్ర ధర్మ యుద్ధంలో టీడీపీ, జనసేన (Janasena) విజయం సాధిస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో జగన్ ముద్దులకే ఓటేశారు. ఈ ప్రాంతంలో జగన్ చేస్తున్న అభివృద్ధి ఏమిటి? ప్రాజెక్టు కట్టి పరిశ్రమ తెచ్చారా? నేను రాయలసీమ కుమారుడిని, రాయలసీమ రక్తం నాలో ప్రవహిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 12,500 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? పీలేరు, పుంగనూరుకు నీళ్లు వచ్చాయా? జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే ప్రారంభమైనవేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత టీడీపీదేనన్నారు. పట్టిసీమ ద్వారా శ్రీశైలం ద్వారా 120 టీఎంసీల గోదావరి నీటిని అందించిన ఘనత టీడీపీదేనన్నారు. టీడీపీ ఉంటే బానకచర్లకు గోదావరి నీళ్లు తెస్తామన్నారు. ఏటా 2000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి కలుస్తోంది. తవ్విన కాల్వలు పూర్తి చేసి ఈ నీటిని తీసుకువస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుందన్నారు. రాయలసీమను పండ్ల తోటల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com