ఈరోజు నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారానికి సిద్దం

ఈరోజు నుంచి  వైసీపీ ఎన్నికల ప్రచారానికి సిద్దం

ఎన్నికల ఏడాది సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ పోరుకు సిద్ధమవుతోంది. ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సిద్ధం పేరుతో భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు వైఎస్ జగన్ (Y S Jagan). దీనిలో భాగంగా వైఎస్ జగన్ నేడు భీమిలిలో తొలి సభ నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 'సిద్ధం' పేరుతో భారీ క్యాడర్ సమావేశాలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. తొలి సమావేశం ఈరోజు (జనవరి 27) భీమిలిలో జరగనుంది. ఇందుకోసం ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 3.5-4 లక్షల మంది పార్టీ కార్యకర్తలు హాజరవుతారని పార్టీ అంచనా వేస్తోంది. అందరికీ, ఇప్పటికే మెసేజ్ లు, IVRS ,ఆహ్వానాలు వెళ్లాయి. మరోవైపు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ సమావేశాల ఏర్పాట్లను ఉత్తరాంధ్ర నేతలు పర్యవేక్షిస్తున్నారు.

2019 ఎన్నికల సమయంలో కూడా వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరోసారి అదే సెంటిమెంట్ ను కొనసాగించేందుకు ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సమావేశంలో నేతలు, కార్యకర్తలకు జగన్ స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. రానున్న అసెంబ్లీ, లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. వైఎస్ జగన్ మరోసారి విజయం సాధించాలని పట్టుదలతో అడుగులు వేస్తున్నారు.

సిఎం జగన్ ఎన్నికల పోరు నినాదం సిద్దంపై వైఎస్సార్‌సీపీ క్యాడర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఈ ఎన్నికల నినాదం లోగోను డిజిటల్‌, వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు టీడీపీ ప్రచార యంత్రాంగానికి సవాల్ విసిరేలా 'సిద్ధం' ప్రచారానికి సిద్ధమైంది. టీడీపీ-జనసేన (TDP - Janasena), జాతీయ పార్టీల కూటమి తమతో జతకట్టడంతో పాటు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సందేశం పంపాలని భావిస్తున్నారు. భీమిలి తొలి సభను విజయవంతం చేసి, ప్రతిపక్షాలకు గట్టి సవాల్‌ ఇవ్వాలని చూస్తున్నారు. కొత్త ఉత్సాహంతో ఎన్నికల పోటీకి దిగాలని రెడీ అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story