కులాల మధ్య చిచ్చు పెడుతున్న వైసిపి.. ఎప్పుడూ ఇదే పనా..

కులాల మధ్య చిచ్చు పెడుతున్న వైసిపి.. ఎప్పుడూ ఇదే పనా..
X

ఏపీలో అధికారం పోయిన తర్వాత వైసిపి పరిస్థితి నీళ్లలో నుంచి ఒడ్డున పడ్డ చాపలాగా మారింది. అధికారం లేదని గిలగిలా కొట్టుకుంటుంది. ఓవైపు కూటమి ప్రభుత్వం ప్రపంచ దిగ్గజ సంస్థలను ఏపీకి తీసుకువచ్చి అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమాన్ని కూడా అందరికీ అందిస్తోంది. దీంతో కూటమి ఇమేజ్ ప్రజల్లో అమాంతం పెరిగిపోతుంది. ఇలా అయితే వైసీపీని ఎవరూ పట్టించుకోరు అనే ఉద్దేశంతో.. ఎలాగైనా కూటమికి చెడ్డ పేరు తీసుకురావాలని కులాల మధ్య చిచ్చు పెట్టడం స్టార్ట్ చేసింది వైసిపి. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే దానికి కులాలకు ఆపాదించి గొడవలు సృష్టిస్తోంది. ఎలాగైనా రాష్ట్రంలో అలజడి సృష్టించి కూటమిపై బురద జల్లాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా నెల్లూరులో జరిగిన లక్ష్మీనాయుడు హత్యపై కులాల మధ్య గొడవకు తెరలేపింది. లక్ష్మీ నాయుడు కాపు యువకుడు కాబట్టి.. కావాలనే ఓటమి ప్రభుత్వం చంపేసిందని.. ఆయన హత్య వెనకాల టిడిపి ఉందని రకరకాల ప్రచారాలు చేయడం స్టార్ట్ చేసింది. వైసిపి నేతలు మృతుడి గ్రామానికి వెళ్లి ప్రెస్ మీట్ లు పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాపు యువకులను రెచ్చగొట్టి గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను దారుణంగా చంపేస్తున్నారని.. అయినా సరే నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వాస్తవానికి లక్ష్మీ నాయుడు చనిపోయింది ఆర్థిక లావాదేవీల గొడవలో. ఇద్దరి మధ్య గొడవ జరిగితే అది చంపే దాకా తీసుకెళ్ళింది. దానికి కులాలను ఆపాదించడం ఏంటి. ఈ హత్య జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపి హోం మంత్రి అనిత, మంత్రి నారాయణ, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ లను దార కానిపాడుకు పంపారు. మృతుడి భార్య సుజాతతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి సుజాతకు ధైర్యం ఇచ్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అవసరమైతే స్పెషల్ కోర్టు వేసి త్వరగా న్యాయం జరిగేలా చేస్తామన్నారు. మంత్రి అనిత మాట్లాడుతూ వైసిపి కావాలనే కులాలకు ఆపాదిస్తుందని ఆరోపించారు. ప్రతి మనిషికి పుట్టుకతోనే కులం వస్తోందని.. కాబట్టి ఇద్దరు మధ్య జరిగిన గొడవను కులాలకు అంటగట్టడం మంచిది కాదని సూచించారు. ఇదే విషయాన్ని బాధితులకు కూడా విజ్ఞప్తి చేశారు.

సుజాత, ఆమె ఇద్దరు పిల్లలకు అన్ని విధాలుగా ఆర్థికంగా సాయం చేస్తామన్నారు హోం మంత్రి అనిత. వాళ్ల ఆర్థిక పరిస్థితి పై సీఎం చంద్రబాబు నాయుడుకు నివేదిక పంపిస్తామని చెప్పారు. తక్షణసాయంగా సుజాతకు ఆర్థిక సాయం అందజేశారు. ఇక్కడే కూటమి ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో అర్థం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాము.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలో స్పీడ్ గా స్పందిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతిఘటనలో సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. తప్పు చేసింది సొంత పార్టీ నేతలైన సరే వెంటనే సస్పెండ్ చేసి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నారు. గత జగన్ పాలనలో ఎప్పుడైనా నిందితులు వైసీపీ వాళ్లు అయితే చర్యలు తీసుకోవడం చూశామా.. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం తప్పు చేసింది ఎవరైనా సరే అస్సలు వదిలిపెట్టట్లేదు. కులాల మధ్య చిచ్చులు పెట్టడం మంచిది కాదని.. ప్రజలకు కావాల్సింది సత్వర న్యాయమని ఆయన పదే పదే చెబుతున్నారు. కానీ వైసీపీ మాత్రం రాష్ట్రంలో రౌడీ షీటర్లపై యాక్షన్ తీసుకున్నా సరే వారు తక్కువ కులం కాబట్టి చర్యలు తీసుకున్నారు అని కూటమిపై బురద జల్లుతుంది. అంటే ఎంతటి తప్పు చేసినా సరే నిందితులపై యాక్షన్ తీసుకోవద్దా.. తీసుకుంటే కులానికి ఆపాదించడం కరెక్టేనా.. ప్రతిపక్షమైన వైసీపీ పాలనాపరమైన విధానాలపై విమర్శలు చేస్తే ఒక అర్థం ఉంటుంది. ఇలా ప్రతిదాంట్లో కులాన్ని తీసుకొచ్చి గొడవలు సృష్టించాలని చేస్తే ప్రజల్లో మెప్పు రాదు.

Tags

Next Story