AP : వైసీపీ వాళ్లు నాకు శత్రువులు కాదు: పవన్ కళ్యాణ్

AP : వైసీపీ వాళ్లు నాకు శత్రువులు కాదు: పవన్ కళ్యాణ్
X

తనకు తిట్టడానికి టైమ్ లేదని, బోలెడంత పని ఉందని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అన్నారు. ‘వైసీపీ వాళ్లు నాకు శత్రువులు కాదు. నేను వ్యక్తిగత కక్షలకు దిగను. ప్రకృతి వారికి 151 సీట్లు ఇచ్చి పరీక్షించింది. కానీ వారు దాన్ని నిలుపుకోలేదు’ అని గొల్లప్రోలు సభలో వ్యాఖ్యానించారు. తాను మాట్లాడుతుండగా కొందరు కార్యకర్తలు అడ్డుపడడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రేమగా మాట్లాడుతుంటే అలుసుగా తీసుకోవద్దని హెచ్చరించారు.

సమాజానికి ఏదోకటి చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘నేను కేవలం ఎమ్మెల్యేనే కాదు. NDAకు అండగా నిలబడ్డ వ్యక్తిని. నాకు భయం తెలియదు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. పిఠాపురం నేతలు అండగా లేకుంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవి. నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలనే విధంగా అభివృద్ధి చేస్తా’ అని గొల్లప్రోలులో జరిగిన ఆత్మీయ సమావేశంలో వ్యాఖ్యానించారు.

భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేశారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాలయను దుర్వినియోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story