Pawan Kalyan : వదిన సురేఖకు పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు అప్పు ఉన్నారో తెలుసా..!

Pawan Kalyan : వదిన సురేఖకు పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు అప్పు ఉన్నారో తెలుసా..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా తన ఆస్తులు, అప్పుల వివరాలతో అఫిడవిట్ ను ఈసీకి సమర్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ.114.76 కోట్లు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్లు. అలాగే అప్పులు రూ. 64. 26 కోట్లు. రూ. 20 కోట్లు విరాళాలు అందించినట్టు అఫిడవిట్ లో తెలిపారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి అప్పులు రూ.64,26,84,453 ఉన్నాయని.. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46 కోట్ల 70 లక్షలు ఉన్నాయని అందులో తెలిపారు.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చాలా మంది నిర్మాతల నుండి అడ్వాన్స్‌లు తీసుకుని కొన్ని సినిమాలను కూడా మొదలుపెట్టారు. AM రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న హరి హర వీర మల్లు, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఉస్తాద్ భగత్ సింగ్, DVV దానయ్య నిర్మాతగా #OG సినిమాలు ఉన్నాయి. అయితే ఈ నిర్మాతలు చెల్లించిన చాలా అడ్వాన్స్‌లు.. రుణాలుగా జాబితాలో చూపించారు. హారిక హాసిని క్రియేషన్స్, రామ్ తాళ్లూరి కి చెందిన లీడ్ ఐటి సొల్యూషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన మైత్రి నవీన్, శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్స్, డివివి దానయ్యలను రుణదాతల లిస్ట్ లో చేర్చారు పవన్. మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ నుంచి పవన్ 2 కోట్లు రుణం తీసుకున్నట్టు అఫిడవిట్ లో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story