Maruti Suzuki : 2024 స్విప్ట్, డిజైర్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే..1

Maruti Suzuki : 2024 స్విప్ట్, డిజైర్..  ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే..1

ఇండియాలో మిడిల్ క్లాస్ లగ్జరీ కార్‌గా స్విఫ్ట్, డిజైర్ గా చెప్పుకోవచ్చు. మారుతి కంపెనీ నుంచి రిలీజైన కొన్ని పాత మోడళ్లు సైతం ఇప్పటికీ విక్రయాలు జరుపుకుంటున్నాయి. వీటిలో స్విప్ట్ ఒకటి. స్విప్ట్ గత ఫిబ్రవరి నెలలో టాప్ పొజిషన్లో ఉంది. దీనిని నేటి వినియోగదారులకు అనుగుణంగా మార్చి కొత్త తరహా స్విప్ట్ ను తీసుకొస్తున్నారు.

డిజైర్ కూడా కొత్త మోడల్ వస్తోంది. మారుతి నుంచి వచ్చే కొత్త స్విప్ట్ (2024) ను ఇప్పటికే జపాన్ లో ఆవిష్కరించారు. పాత స్విప్ట్ తో పోలిస్తే కొత్త స్విప్ట్ బాడీలో ఎలాంటి మార్పులు లేవు. కానీ ఐకానిక్ డిజైన్ గా తయారు చేశారు. కొత్త కారులో బంపర్లు, లైట్లు, అలాయ్ వీల్స్, రేర్ డోర్ హ్యాండిల్స్ ను లేటెస్ట్ గా అమర్చారు. డిజైర్ విషయానికొస్తే పాత కారు కంటే కొత్త దానిలో బూట్ స్పేస్ పెంచారు. ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కొత్త డయల్స్, అప్డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను అమర్చారు. కాస్ట్ లీ కార్లలో కనిపించే సన్ రూప్ ను డిజైర్ లోనూ సెట్ చేసే అవకాశం ఉంది.

ధర విషయంలోనూ స్వల్ప మార్పులు మాత్రమే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త స్విప్ట్ ను రూ.6.60 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది. డిజైర్ సైతం రూ.6.60 లక్షల ఎక్స్ షోరూం ఉండే ఛాన్స్ ఉంది. 2024 స్విప్ట్ లో ఇంజిన్ గరిష్టంగా 80 బీహెచ్ పీ పవర్, 108 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేయనుంది. కొత్త మోడల్ లీటర్ కు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. డిజైర్ కు సంబంధించిన ఇంజిన్ లో కొన్ని మార్పులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే మార్కెట్ లోకి రానున్నాయి ఈ కొత్త మోడల్స్.

Tags

Read MoreRead Less
Next Story