Chicken Prices : బాబోయ్.. మళ్లీ పెరిగిన చికెన్ ధరలు.. ఇప్పుడెంతో తెలుసా ?

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన చికెన్ ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం వేసవి కావడంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుండటం సాధరణమే అని చెప్పాలి. తాజాగా రేట్స్ మళ్లీ కొండెక్కాయి. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ కేజీ ధర రూ.300గా ఉంది. గతవారం చికెన్ రేట్ కేజీ రూ.220 నుంచి రూ.240 వరకు పలికింది. పెరిగిన చికెన్ ధరలు చూసి నాన్ వెజ్ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. వారంలోపే ధరలు ఇంతలా పెరిగడంతో షాక్ అవుతున్నారు,
తెలంగాణతో పాటుగా ఏపీలోని ప్రధాన పట్టణాల్లో చికెన్ ధరలు సైతం ఇలానే కొనసాగుతున్నాయి. అయితే చికెన్ ధరలు పెరిగిన కోడిగుడ్ల ధరలు తగ్గి సామన్యులకు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. గతవారం రూ.7 పలికిన కోడిగుడ్డు ప్రస్తుతం రూ.5కు చేరింది. కోడి గుడ్ల ధరలు ఇంతకన్నా తగ్గే ఛాన్స్ లేదని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. కానీ చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరుగుతుండడంతో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉందని, దీంతో కోళ్ల లభ్యత తగ్గి చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఫౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కోళ్ల దాణా ధరలలో పెరుగుదల కారణంగా ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com