LIC Kanyadan Policy : ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ.. రూ.151 డిపాజిట్ చేయండి.. రూ.31 లక్షలు పొందండి

LIC Kanyadan Policy : ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ.. రూ.151 డిపాజిట్ చేయండి.. రూ.31 లక్షలు పొందండి

ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆడబిడ్డల తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఈ స్కీమ్ రూపొందించారు. కాల పరిమితి 13 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. LIC కన్యాదాన్ పాలసీని కూతురు పుట్టిన ఒకటి నుండి రెండు సంవత్సరాలలోపు ప్రారంభించడం వలన భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి.

మీకు 30 ఏళ్లు దాటినట్టయితే ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ తీసుకునేందుకు అర్హులు అవుతారు. బిడ్డ ఫస్ట్ బర్త్ డే అయిన తర్వాతే కన్యాదాన్ పాలసీ తీసుకోవాలి. మీ బిడ్డకు కనీసం 1 సంవత్సరం వయస్సు ఉండాలి. ఈ ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ మెచ్చూరిటీ పీరియడ్ 25 ఏళ్లు అయినప్పటికీ, మీరు 22 ఏళ్లు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. మిగిలిన మూడేళ్లు ప్రీమియం కట్టాల్సిన పనిలేదు.

మీ కుమార్తెకు 18 సంవత్సరాల వయస్సులో వివాహం చేయాలనుకుంటున్నట్లయితే LIC కన్యాదాన్ పాలసీ నిబంధనల ప్రకారం.. ఈ పాలసీని 17 ఏళ్లపాటు తీసుకోవచ్చు. కుమార్తె జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ , పాస్‌పోర్ట్ సైజు ఫోటో, బ్యాంక్ పాస్ బుక్ ఇవి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు దగ్గర్లోని ఎల్ఐసీ ఆఫీస్ కు వెళ్లొచ్చు. లేదా వెబ్ సైట్ లో వివరాలు తెలుసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story