New 5G Phone : తిరుగులేని డిస్ ప్లే, ఫీచర్లతో కొత్త 5జీ ఫోన్

New 5G Phone : తిరుగులేని డిస్ ప్లే, ఫీచర్లతో కొత్త 5జీ ఫోన్

తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లు ఉండే 5జీ ఫోన్లు కోరుతున్నారు మొబైల్ యూజర్స్. వారికోసమే ఓ మోడల్ తెచ్చామంటోంది ఒప్పో. A60 పేరుతో సరికొత్త మోడల్ తీసుకొచ్చింది.

90 హెచ్ జడ్ రీ ఫ్రెష్ రేట్, 6.67 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ ఈ ఫోన్ ప్రత్యేకత. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్, 8 జీబీ ర్యామ్ ఈ ఫోన్ కు ఉన్న మరో ప్రధాన ఆకర్షణ. 256 జీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్ 45 డబ్ల్యూ సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ తో లభిస్తుంది. 5000 ఎంఎహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇది 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాలు కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 8 ఎంపీ సామర్థ్యంతో ఏర్పాటుచేసిన కెమెరా సెల్ఫీలకు అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది.

ఒప్పో ఏ60 8 జీబీ + 128 జీబీ ర్యామ్ ధర 18,060 గా ఉంది..8 జీబీ+ 256 జీబీ వేరియంట్ ధర 21,360 వరకు లభిస్తుంది. ఇది మిడ్ నైట్ పర్పుల్, రిప్పల్ బ్లూ కలర్ లో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ మోడల్ ను ఒప్పో కంపెనీ చైనా, వియత్నాం మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఇండియా సేల్ లోకి త్వరలోనే రానుంది. మంచి ఫొటోలు, వీడియోలను ఈ ఫోన్ తీయగలదని.. వ్లాగర్లకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story