Whatsapp Business New Features : వాట్సాప్ బిజినెస్ యూజర్లకు కొత్త ఫీచర్

ఇండియాలో వాట్సప్ బిజినెస్ యూజర్ల కోసం వెరిఫైడ్ ప్రోగ్రామ్ ను మెటా ప్రారంభించినట్టు సంస్థ చీఫ్ మార్క్ జుకర్ బర్క్ ప్రకటించారు. ఫేస్బుక్, ఇన్ స్టాలో ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంది. వాట్సప్ బిజినెస్ యాప్ వాడే వారి కోసం గత సంవత్సరం సెప్టెంబర్లోనే మెటా వెరిఫైడ్ ప్రోగ్రామ్ ను తీసుకు వచ్చింది. తాజాగా భారత్ తో పాటు బ్రెజిల్, ఇండోనేషియా, కొలంబియా దేశాల్లో వాట్సప్ బిజినెస్ యూజర్ల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.
బ్లూ టిక్ నే వెరిఫైడ్ అంటుంటారు. ఇన్, ఫేస్బుక్ లో తరహాలోనే మర్చంట్స్ తమ వాట్సప్ బిజినెస్ అకౌంట్ కు మెటా వెరిఫైడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తీసుకున్నవారికి వాట్సప్ బిజినెస్ బ్లూటిక్ ను జారీ చేస్తారు. దీని వల్ల ఈ బిజినెస్ పేరుతో మరొకరు ఖాతా తెరవకుండా రక్షణ కల్పించడంతో పాటు, మార్కెటింగ్ అవసరాల కోసం వాట్సప్ ఛానెల్ ను కూడా మెటా అందిస్తుంది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇవ్వకుండానే కస్టమర్ సపోర్టుకు నేరుగా కాల్ చేసుకునే సదుపాయంపై మెటా ప్రస్తుతం పని చేస్తోంది.
సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాట్సప్ బిజినెస్ యూజర్లు వివిధ డివైజుల నుంచి లాగిన్ అవ్వడానికి వీలుంటుంది. కస్టమర్లకు, వెండర్లకు కనిపించేలా వ్యాపార వివరాలతో కూడిన కస్టమ్ వెబ్ పేజీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com