PAYTM : భారీగా పుంజుకున్న పేటీఎం షేర్లు

PAYTM : భారీగా పుంజుకున్న పేటీఎం షేర్లు

పేటీఎం (PAYTM) మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు వరుసగా రెండో రోజు పుంజుకున్నాయి. బీఎస్ఈలో సోమవారం ఐదు శాతం పెరిగి రూ.358.55 దగ్గర అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. మర్చంట్ సెటిల్మెంట్ల కోసం యాక్సిస్ బ్యాంక్ తో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలోనే కంపెనీ షేర్లు లాభాల బాట పట్టాయి.

వన్ 97 కమ్యూనికేషన్స్ తమ నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చింది. ఇందువల్ల పేటీఎం క్యూఆర్, సౌండ్బాక్స్, కార్డ్ మెషీన్ సేవలు మార్చి 15 తరవాత వ్యాపారులకు యథావిధిగా కొనసాగుతా యని సంస్థ తెలిపింది. నోడల్ ఖాతా అంటే, సంస్థ ఖాతాదారులు, వ్యాపారుల లావాదేవీలన్నింటినీ ఈ ఖాతా ద్వారా సెటిల్మెంట్ చేస్తారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India)పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL)పై విధించిన పరిమితుల కారణంగా కొనసాగుతున్న సంక్షోభం మధ్య పేటీఎం వ్యాపారి చెల్లింపులను సెటిల్ చేయడానికి యాక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే ఈ సంస్థ షేర్లు పుంజుకోవడం విశేషం

Tags

Read MoreRead Less
Next Story