Reliance : రిలయన్స్ నుంచి డ్రింక్స్.. శ్రీలంక కంపెనీతో డీల్

Reliance : రిలయన్స్ నుంచి డ్రింక్స్..  శ్రీలంక కంపెనీతో డీల్

ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ (Reliance) తన రిటైల్ బిజినెస్ ఎఫ్ఎంసీజీ వ్యాపార విస్తరణపై మరింత దృష్టి పెట్టింది. శీతల పానీయాల విభాగంలో గతంలో కాంపా, కోలా, సోస్యో వంటి బ్రాండ్లను తీసుకువచ్చిన రిలయన్స్ తాజాగా శ్రీలంకు చెందిన ఎలిఫ్యాంట్ హౌస్ బ్రాండ్ శీతల పానీయాలను భారత్ మార్కెట్లోకి తీసు కు రానుంది. దీని కోసం రిలయన్స్ రిటైల్ ఎలిఫ్యాంట్ హౌస్తోతో ఒప్పందం చేసుకుంది. దేశీయ మార్కెట్లో కోకా-కోలా, పెప్పీకి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఎలి ఫ్యాంట్ హౌస్ బ్రాండ్ పేరుతో శీతల పానీయాల తయారీ, మార్కెట్, సరఫరా, రిటైల్ వ్యాపారం చేసుకోవడానికి ఈ కంపెనీతో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమి టెడ్ తో ఒప్పందం చేసుకుంది. దీని వల్ల రిలయన్స్ బేవరేజ్ ప్రొడక్ట్స్ పోర్ట్ఫోలియోను విస్తరించడమే కాకుండా కొత్త ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు అందించడం సాధ్యపడుతుందని రిలయన్స్ తెలిపింది. ఎలిఫ్యాంట్ మైస్ క చెందిన నెక్టో, క్రీమ్ సోడా, (ఈజీబీ జింజిర్ బీర్ ), ఆరెంజ్ బార్లీ, లెమన్ వంటి డ్రింక్స్ ను ఇండియన్ మార్కెట్లో రిలయన్స్ విక్రయించనుంది.

Tags

Read MoreRead Less
Next Story