Gas Cylinders : గ్యాస్ సిలిండర్ పై భారీగా తగ్గింపు

లోక్ సభ ఎన్నికల వేళ చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్లు, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG సిలిండర్ల ధరలను తగ్గించాయి. వంటగ్యాస్ సిలిండర్ ధరలు అలాగే ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్ ధరల్ని తగ్గిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరపై రూ. 30.50 తగ్గింది.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1764.50కి చేరింది. అంతకు ముందు ఇది రూ. 1795 గా ఉండేది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌ల ధర తగ్గింపు ₹30.50 అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 1 నాటికి, ఢిల్లీలో సిలిండర్ ధర ₹1,764.50గా ఉంది. అదనంగా, 5 కిలోల FTL సిలిండర్ల ధర ₹7.50 తగ్గింది. కమర్షియల్ గ్యాస్ ధరలు కోల్‌కతాలో రూ. 1879, ముంబైలో రూ. 1717.50, చెన్నైలో రూ. 1930 కి చేరాయి. హైదరాబాద్‌లో కూడా ఈ ధర తగ్గినట్లు తెలుస్తోంది. గత నెలలో రూ. 25 పెరిగి రూ. 2027 కు చేరగా.. ఇప్పుడు రూ. 30.50 తగ్గింది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) గత నెలలో సగటు అంతర్జాతీయ ధరల ఆధారంగా ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేదు. ఢిల్లీలో ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 803 గా ఉంది. హైదరాబాద్‌లో ఇది రూ.855 గా ఉంది. ఎన్నికలవేళ ఇది రిలీఫ్ గా భావిస్తున్నారు వినియోగదారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com