Kannappa : మంచు విష్ణు కన్నప్పలో అక్షయ్ కుమార్ !

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతడు షూటింగ్‌లో పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదే నిజమైతే ఆయనకు ‘కన్నప్ప’ తొలి తెలుగు సినిమా అవుతుంది. గతంలో 1993లో ఓ కన్నడ సినిమాలో ఆయన కనిపించారు. ఆ తర్వాత 2018లో రజనీ హీరోగా తెరకెక్కిన రోబో2.0లో తమిళ ఇండస్ట్రీకి పరిచమయ్యారు.
ఈ సినిమా కీలక సన్నివేశాలను న్యూజిలాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందుతోంది.
రీసెంట్‌గా మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా వదిలారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్‌లో విష్ణు జలపాతం నుంచి ఎంట్రీ ఇస్తూ.. బాణంను ఎక్కుపెట్టినట్లు కనిపిస్తున్నాడు. అలాగే, ఈ చిత్రంలో ప్రభాస్ మహా శివునిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అదే విధంగా పార్వతీ దేవిగా నయనతార కనిపించనుందని టాక్. ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్ లు ఉంటాయట. ముఖ్యంగా చాలా మంది స్టార్స్ పేర్లు కూడా ఈ సినిమాలో యాడ్ కాబోతున్నాయి అని తెలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com