రాజధాని ఫైల్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

రాజధాని ఫైల్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

రాజదాని ఫైల్స్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు ఆమోదం తెలిపింది. సెన్సార్ సర్టిఫెక్టు సహా అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. అనంతరం సినిమా విడుదలపై విధించిన స్టేను ఎత్తివేసింది. దీంతో సినిమా విడుదలకు నిర్మాతలు సన్నద్ధం అవుతున్నారు. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మూవీ టీం తెలిపింది. ప్రస్తుతం రిలీజ్ స్లాట్స్ కోసం చూస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ సినిమా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని, ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం గరువారం సినిమా విడుదలపై స్టే విధించింది. అంతేకాకుండా సినిమాకు సంబంధించిన అన్ని రికార్డులను తమకు సమర్పించాలని కోరింది. ఆయా రికార్డులను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం అన్నీ సక్రమంగానే ఉన్నాయని, సినిమాను విడుదల చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story