Balakrishna : ఎన్టీఆర్ అంటే ఒక శక్తి : బాలకృష్ణ

Balakrishna : ఎన్టీఆర్ అంటే ఒక శక్తి :  బాలకృష్ణ

నందమూరి తారక రామారావు అంటే తెలియని తెలుగు వారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. నటుడిగా, నాయకుడిగా ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రాముడు, కృష్ణుడు అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఆయన రూపమే. ‘అన్నగారు’ అని అందరూ ఆప్యాయంగా తలుచుకునే వ్యక్తి ఆయన. సినీరంగంలో, రాజకీయ రణరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న ‘యుగ పురుషుడు’ ఎన్టీఆర్ జయంతి నేడు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు ఎన్టీఆర్ ఫ్యామిలీ, టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నారు. నేడు ఉదయం ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చి నివాళులు అర్పించగా తాజాగా బాలకృష్ణ వచ్చి తన తండ్రికి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో ఆయన సాధించిన విజయాలు గుర్తుచేస్తూ ఎన్టీఆర్ అంటే ఒక శక్తి అని అన్నారు.

తన తాత నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను’ అని ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాళులు అర్పించారు. అన్నగారి సేవలను స్మరించుకుందామని ట్వీట్ చేశారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఆయనను మహానాయకునిగా తీర్చిదిద్దాయన్నారు. టీడీపీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు NTR శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags

Next Story