Kalki Update: కల్కి మూవీ నుంచి ఇవాళ బిగ్ అప్‌డేట్

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి ఇవాళ బిగ్ అప్‌డేట్ రానుంది. ‘సమయం వచ్చింది. సాయంత్రం 5 గంటలకు ప్రకటన. వేచి ఉండండి’ అని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది.
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనె వంటి స్టార్స్ నటిస్తున్నారు. కల్కి చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల అమితాబ్ ని అశ్వత్థామగా చూపించి కల్కి సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచారు. తాజాగా కల్కి రిలీజ్ డేట్‌కు సంబంధించి కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా కల్కి 2898ఏడీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త రిలీజ్ డేట్‌ను ఏప్రిల్ 27న (నేడు) అఫీషియల్‌గా సినిమా యూనిట్ అనౌన్స్‌చేసే అవకాశం ఉందని అంటున్నారు.
నాగ అశ్విన్ ఓ ఇంటర్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా కల్కి అనే టైటిల్ నిర్ణయించడానికి కారణం కూడా ఉదహరించారు. చిత్ర కథ మహాభారతం కాలం నుండి ప్రారంభమవుతుందని, 2898తో పూర్తవుతుందని చెప్పారు. అంటే గతంతో మొదలెట్టి భవిష్యత్తులో ముగుస్తుంది. అందుకే కల్కి అనే టైటిల్ పెట్టడం జరిగింది. చిత్ర కథనం మొత్తం ఆరు వేల సంవత్సరాల మధ్య జరుగుతుందని, దానికి తగినట్టుగా కొత్త ప్రపంచాన్ని సృష్టించిన నట్టుగా తెలిపారు. కొత్త ప్రపంచంలో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com