Chiranjeevi : చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ మృతి

Chiranjeevi : చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ మృతి
X

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా లంగ్స్ డ్యామేజ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు సినీవర్గాలు తెలిపాయి. శ్రీజ కొణిదెల 2007లో శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అదనపు కట్నం కోసం శిరీష్‌ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని 2012లో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు పెరగడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. 2019లో శిరీష్ మరో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను శిరీష్‌ భరద్వాజ్‌ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలో ఉన్నట్లు సమాచారం. అయితే, కొంత కాలంగా శిరీష్‌ భరద్వాజ్‌ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శిరీష్ భరద్వాజ్ గుండె పోటుతో మృతి చెందినట్టుగా శిరీష్ స్నేహితులు తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.

Tags

Next Story