Kriti Sanon : అలాంటి వాడితోనే డేటింగ్ చేస్తా : కృతి సనన్

Kriti Sanon : అలాంటి వాడితోనే డేటింగ్ చేస్తా :  కృతి సనన్

1నేనొక్కడినే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీ.. కృతి సనన్ (Kriti Sanon). అనంతరం బాలీవుడ్ సినిమాల్లో ఈ అమ్మడు నటించింది. ప్రస్తుతం అక్కడ ఫుల్ బిజీగా ఉంది. ఒక్కో సినిమాకు భారీ పారితోషికాన్నే అందుకుంటూ దూసుకెళ్తంది. ఇటీవలే రిలీజైన క్రూ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో కృతి నటనకు మంచి పేరొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను డేటింగ్ చేసే వ్యక్తి ఫలానా విధంగా ఉండాలంటూ చెప్పుకొచ్చింది కృతి సనన్.

తాను శ్వేత జాతీయుడికి పడిపోనని.. హాట్ గా ఉండి ఉండొచ్చు కానీ వారిని ఇష్టపడనని పేర్కొంది. స్వదేశీయుడితోనే డేటింగ్ చేసేందుకే మొగ్గు చూపుతానని పేర్కొంది. తనకు కనీసం హిందీ అర్థం చేసుకునే భాగస్వామి కావాలని తెలిపింది. అలాగే పంజాబీ, హిందీ పాటలకు డ్యాన్సులు చేసే వ్యక్తితో డేటింగ్ చేస్తానని కూడా హింట్ ఇచ్చింది.

అయితే కృతి సనన్ గతంలో ఆదిపురుష్ షూటింగ్ టైమ్లో ప్రభాస్తో డేటింగ్ చేసిందని పుకార్లు వచ్చాయి. కానీ ఈ బ్యూటీ వాటిని ఖండించింది. ప్రభాస్ మంచి స్నేహితుడు మాత్రమేనని చెప్పుకొచ్చింది. ఇటీవల ఎం.ఎస్.ధోని స్నేహితుడు కబీర్ బహియాతో కృతి డేటింగ్ చేస్తోందని రూమర్స్ వచ్చాయి. దీనిపై ఈ అమ్మడు స్పందించలేదు.

Tags

Read MoreRead Less
Next Story