Kalki Update : రేపే ప్రభాస్ 'కల్కి' అభిమానులకు కానుక!

Kalki Update : రేపే ప్రభాస్ కల్కి అభిమానులకు కానుక!

ప్యాన్ ఇండియా స్థాయిలో ఉత్కంఠ రేపుతున్న సినిమాల్లో ప్రభాస్ (Prabhas) కల్కి (Kalki) ఒకటి. మే 9న మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కొంత లేట్ అయ్యే చాన్సుంది. కల్కికి కొత్త రిలీజ్ డేట్ అఫీషియల్ గా రావాల్సి ఉంది. ఉగాది రోజున ఈ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. దీంతోపాటు.. ఓ వీడియో కానీ.. యానిమేషన్ గ్లింప్స్ కానీ.. రిలీజ్ చేస్తారని సమాచారం.

మే 30న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని సమాచారం. రేపు ఉగాది సందర్భంగా రిలీజ్ డేట్ ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించబోతోంది. ఈ సందర్భంగా కొత్త సర్ ప్రైజ్ కూడా ఉంటుందని టాక్. ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది.

ప్రమోషన్ కార్యక్రమాల్ని కూడా మొదలుపెట్టనున్నారు. ఈ రెండు నెలల కల్కి జాతర ఉంటుందని తెలుస్తోంది. వీటికోసం ఇప్పుడు ఫ్యాన్స్ వెయిటింగ్. అమితాబ్ బచ్చన్‌, కమల్ హాసన్‌, దీపికా పదుకొణె లాంటి స్టార్లు ఉండటంతో... ప్యాన్ ఇండియా స్థాయిలో కోట్లాది మంది కళ్లు ఇప్పుడు కల్కిపై ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story