Kalki Trailer : కల్కి ట్రైలర్ కోసం జనం వెయిటింగ్.. దీపికా గ్లింప్స్ వైరల్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ( Rebel Star Prabhas ) హీరోగా నటిస్తున్న ఇండియాస్ మోస్ట్ కాస్ట్‌లీయెస్ట్ మూవీ 'కల్కి 2898' ఎడి ట్రైలర్ జూన్ 10న ఇవాళ విడుదలవుతోంది. ఈ చిత్రం కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మన ఇండియన్ సినిమా నుంచి ఇది డెఫినెట్ ఒక గేమ్ ఛేంజింగ్ సినిమాగా నిలుస్తుంది అంటున్నారు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ , ఆయన ఇమాజినేషన్ పై చాలామందిలో క్యూరియాసిటీ నెలకొంది. ఈ సైఫై సినిమాలో ఆయన టైం ట్రావెల్ స్టోరీని ఎలా చూపిస్తారనేది విపరీతమైన ఆసక్తిని రేపుతోంది.
మూవీ పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకుంటున్నారు. లేటెస్ట్ గా నటి దీపికా పదుకోణ్ నయా పోస్టర్ ను రిలీజ్ చేశారు. దేనికోసమే ఆశిస్తూ... హోప్ ఫుల్ గా, ఎమోషనల్ గా దీపికా కనిపిస్తోంది. ఒక ఆశ మొదలయ్యేది ఆమెతోనే అనే ట్యాగ్ లైన్ ను కూడా పోస్టర్ లో చేర్చడంతో ఆమె కోసమే హీరో అక్కడ ఎంట్రీ అవుతాడనేది తేలిపోయింది. ప్రతి క్యారెక్టర్ పోస్టర్ కు వెనకాల చూపించిన బీజీ మెటీరియల్ మూవీపై పిచ్చ క్రేజ్ పెంచేస్తోంది. జూన్ 27న రిలీజ్ కానున్న ఈ మూవీకి ప్రమోషన్ ను ట్రైలర్ తో హీటెక్కించనున్నారు మేకర్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com