Fire Accident : బాలీవుడ్ నటి అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం

Fire Accident : బాలీవుడ్ నటి అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం

బాలీవుడ్ (Bollywood) నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్ లో గత రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ముంబై బాంద్రావెస్ట్ లోని నౌరోజ్ హిల్ సొసైటీలో ఆమె నివాసం ఉంటున్నారు. రాత్రి 8 గంటల సమయంలో అపార్ట్మెంట్లోని 14వ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్స్ తో మంటలను అదుపుచేశారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జాక్వెలిన్ 15వ ఫ్లోర్ లో ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. 2023లో జాక్వెలిన్ ఇక్కడ ఇల్లు కొనుక్కుంది. గతేడాది జులైలో ఆమె తన ఇంటి వీడియో వైరల్‌గా మారింది. ఈ భవనంలో చాలా మంది వ్యాపారవేత్తలు, ప్రముఖులు నివసిస్తున్నారు.

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, రణబీర్ కపూర్, అలియా భట్ అలాగే మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ ఇక్కడ పక్కపక్కనే నివసిస్తున్నారు. ఈ భవనానికి సమీపంలోనే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇల్లు కూడా ఉంది. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె కూడా ఇదే ప్రాంతంలో ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story