Kannappa : కన్నప్పకి అక్షయ్ కుమార్ బై బై

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పాత్రకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తైంది. ఈ క్రమంలో మూవీ టీమ్ ఆయనకు వీడ్కోలు పలికింది. అక్షయ్ నుంచి ఎంతో నేర్చుకున్నానని.. ఈ ప్రయాణం ఎంతో విలువైనదని హీరో మంచు విష్ణు అన్నారు. అక్షయ్ ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నందీశ్వరుడి పాత్రను ప్రభాస్ పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్‌గా మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా వదిలారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్‌లో విష్ణు జలపాతం నుంచి ఎంట్రీ ఇస్తూ.. బాణంను ఎక్కుపెట్టినట్లు కనిపిస్తున్నాడు. అలాగే, ఈ చిత్రంలో ప్రభాస్ మహా శివునిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అదే విధంగా పార్వతీ దేవిగా నయనతార కనిపించనుందని టాక్. ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్ లు ఉంటాయట. ముఖ్యంగా చాలా మంది స్టార్స్ పేర్లు కూడా ఈ సినిమాలో యాడ్ కాబోతున్నాయి అని తెలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com