Teja Sajja : హనుమాన్ ఎఫెక్ట్.. తేజా సజ్జాకు బంపరాఫర్!

హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజా సజ్జా (Teja Sajja). పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన ఈ సినిమా.. ఇప్పటి వరకు రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ కు దర్శకత్వం వహించాడు. ఇప్పుడిప్పు డే హీరోగా కెరీర్ ప్రారంభిస్తున్న తేజా సజ్జాకు ఈ మూవీ మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. హనుమాన్ సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న తేజాకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కల్కి 2898 ADలో తేజా సజ్జా కీలకపాత్రలో నటిస్తున్నడట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరే కాకుండా రాజేంద్రప్ర సాద్, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ సహా మిగతా నటీనటులు నటించను న్నారని టాక్. అయితే వీటిపై అఫిషియల్ గా ఎటువంటి అనౌన్స్ మెంట్ రాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com