Kalki 2898 AD : రూ.500 కోట్లు దాటేసిన కల్కి

Kalki 2898 AD : రూ.500 కోట్లు దాటేసిన కల్కి
X

ప్రభాస్ ( Prabhas ), నాగ్ అశ్విన్ ( Nag Ashwin ) కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి’ మూవీ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టినట్లు వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. శనివారం వరకు ఈ చిత్రం రూ.415 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అమితాబ్, కమల్, దీపిక వంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు.

ఇక మూవీకి పాజిటివ్ టాక్ రావ‌డంతో వ‌సూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ద‌గ్గ‌ర‌లో పెద్ద చిత్రాలేవి కూడా విడుద‌ల‌కు సిద్ధంగా లేక‌పోవ‌డంతో క‌ల్కి క‌లెక్షన్లు స్టడీ గానే ఉండే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయం ప‌డుతున్నారు. సైన్స్‌ఫిక్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా అభిమానుల‌ను ఉర్రుత‌లూగిస్తోంది. ఇప్పటికే వివిధ రంగాల‌కు చెందిన ప్రముఖులు మూవీని చూసి ప్రశంస‌లు కురిపించారు. భార‌త సినిమా స్థాయిని పెంచే చిత్రాన్ని ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ అందించాడంటూ పొగ‌డ్తల‌తో ముంచెత్తారు.

Tags

Next Story