Kalki 2898 AD : రెండు ఓటీటీల్లోకి ‘కల్కి 2898 ఏడీ’?

Kalki 2898 AD : రెండు ఓటీటీల్లోకి ‘కల్కి 2898 ఏడీ’?
X

ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ మూవీ రెండు ఓటీటీల్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో, ప్రాంతీయ భాషలు అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సౌత్ డిజిటల్ రైట్స్ రూ.200 కోట్లు, నార్త్ డిజిటల్ రైట్స్ రూ.175 కోట్లకు అమ్ముడైనట్లు టాక్.

కాగా, సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె, దిశా పటానీలు హీరోయిన్లుగా నటిస్తుండగా కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags

Next Story