Kalki 2898 AD OTT Release Date : ఓటీటీలోకి కల్కి.. ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎడి’ సినిమా రూ.1,000 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దక్షిణాది భాషల OTT హక్కులను అమెజాన్ ప్రైమ్, హిందీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ పొందింది. ఈక్రమంలో రిలీజ్ తేదీపై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రిలీజైన 7-8 వారాల తర్వాత OTTలోకి వచ్చేలా ఆగస్టు 15న కల్కిని స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.
ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా దాదాపు నెల రోజుల లోపే .. ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. మొదట్లో థియేటర్ సినిమాలు ఓటీటీ లోకి రావడం కాస్త సర్ప్రైజ్ అనిపించినా కానీ.. ఇప్పుడు మాత్రం ప్రేక్షకులు దీనికి అలవాటు పడిపోయారు. అయితే భారీ బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం ఎవరు.. త్వరగా ఓటీటీ ఎంట్రీని ఎక్స్పెక్ట్ చేయరు. ప్రభాస్ కల్కి విషయంలో కూడా అందరు ఇలానే అనుకున్నారు.
అసలే మూవీ రిలీజ్ కు ముందు.. మూవీ కి సంబంధించి వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా.. పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. కాబట్టి ఓటీటీ ఎంట్రీకి కూడా చాలా ఆలస్యం అవుతుందని అందరు ఫిక్స్ అయిపోయారు, కానీ మేకర్స్ మాత్రం ఈ విషయంలో అందరికి షాక్ ఇచ్చారు. ఈ సినిమాను ఆగష్టు 15 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకుని రానున్నట్లు.. టాక్ వినిపిస్తుంది. దాదాపు ఈ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగానే అనిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమేనా విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com