Kalki Sequel : కల్కి సీక్వెల్‌కు మరో మూడేళ్లు?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే క్లైమాక్స్ పూర్తికాకపోవడంతో ఈ మూవీకి పార్ట్-2 ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో యాస్కిన్‌తో అశ్వత్థామ, భైరవ పోరాడే కథ కొనసాగుతుందని, కల్కికి సీక్వెల్ ఉందని నాగ్ అశ్విన్ స్పష్టతనిచ్చారు. కానీ, దీనికి మరో మూడేళ్లు ఆగాల్సిందేనని సినీవర్గాలు అంచనా. కాగా ప్రభాస్ ‘సలార్’కు కూడా సీక్వెల్ ఉంది.
భారతీయ సినిమా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో సందడి చేస్తోందని కమల్ హాసన్ అన్నారు. కల్కి సినిమా రెండవ భాగంలో తన పాత్ర ఎక్కువ సేపు ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని మేకర్స్ తనకు ముందే చెప్పారన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు ఓపిక ఎక్కువ అని, పురాణాలను సైన్స్‌కు ముడిపెట్టి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. ఇందులో ఆయన ‘సుప్రీం యాస్కిన్’ అనే నెగటివ్ రోల్‌లో నటించిన సంగతి తెలిసిందే.
కల్కి 2898ADతో మరో సూపర్ హిట్ సాధించిన ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన నటించిన ఐదు సినిమాలు రిలీజైన తొలిరోజే రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరోగా డార్లింగ్ నిలిచారు. బాహుబలి-2 రూ.217 కోట్లు, కల్కి రూ.191.5 కోట్లు, సలార్ రూ.178 కోట్లు, ఆదిపురుష్ రూ.140 కోట్లు, సాహో రూ.130 కోట్లు తొలిరోజే వసూలు చేశాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com