Keerthy Suresh : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో కీర్తి సురేశ్?

సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో మెప్పించిన కీర్తి సురేశ్.. ఇప్పుడు లెజెండరీ సింగర్ దివంగత MS సుబ్బలక్ష్మి జీవిత కథలో నటించనున్నారని తెలుస్తోంది. తమిళనాడులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సుబ్బలక్ష్మి గొప్ప గాయనిగా ఎలా ఎదిగారు? ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, జీవితంలో విషాద ఘటనలన్నీ ఇందులో ఉంటాయని సమాచారం. కోలీవుడ్ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తారని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయని టాక్.
అలాగే త్రిష, నయనతార, రష్మిక పేర్లు కూడా ఈ బయోపిక్‌లో చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్.. డైరెక్టర్‌తో కలిసి స్ర్కిప్ట్ ఫైనల్ చేసే పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సుబ్బలక్ష్మి జీవితం గురించి ఎంతో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి.
మదురైలో మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమాపై ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. మరి ఆ లెజెండరీ సింగర్ బయోపిక్‌లో నటించే చాన్స్ ఫైనల్‌గా ఎవరు అందుకుంటారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com