Kriti Sanon : టాలీవుడ్ పై మళ్ళీ కన్నేసిన కృతిసనన్

Kriti Sanon : టాలీవుడ్ పై మళ్ళీ కన్నేసిన కృతిసనన్

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి అనంతరం సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతిసనన్. తన మొదటి సినిమానే మహేష్ బాబుతో 1 నేనొక్కడినేలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోవడంతో.. ఈ అమ్మడికి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే నేనొక్కడినే తర్వాత హీరో పంటిలో నటించింది.

అనంతరం టాలీవుడ్ లో నాగ చైతన్యతో దోచెయ్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో.. ఇక దృష్టంతా బాలీవుడ్ పైనే పెట్టింది. అక్కడ వరుస పెట్టి సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకుంది. రీసెంట్ గా క్రూ సినిమాతో మరో మంచి సక్సెస్ అందుకుంది కృతి సనన్. ఆ సినిమాలో కరీనా కపూర్, టబులతో కలిసి సత్తా చాటింది. అయితే కృతి సనన్ ఇప్పుడు టాలీవుడ్ మళ్లీ నటించేందుకు ఆసక్తి చూపుతుందట.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ సినిమాలపై తన అభిమానాన్ని చాటుకుంది. ఇక్కడ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెబుతోంది. ఈ మధ్య టాలీవుడ్ సినిమాలు ఇండియా వైడ్ గా రిలీజై.. మంచి హిట్ అవుతున్నాయి. అందుకే కృతి సనన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో కృతి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు, హిందీలో రిలీజైంది.

Tags

Next Story