Kriti Sanon : కృతి సనన్ బ్రాలెట్(@రూ.1.79లక్షలు

హిందీలో కమర్షియల్ యాడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కృతి సనన్. అనంతరం టాలీవుడ్ మూవీ 1 నేనొక్కడినేతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మహేశ్ బాబు హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఆ సినిమా... ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వకపోవడంతో ఇక్కడ ఈ బ్యూటీకి ఎక్కువగా అవకాశాలు అందలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం మంచి ఆఫర్లే వచ్చాయి. అక్కడ స్టార్ హీరోలతో నటించి.. భారీ హిట్ లు అందుకుంది. టాలీవుడ్ లో ప్రభాస్ కు జోడీగా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది. రీసెంట్ గా లేడీ ఓరియెంటడ్ సినిమా క్రూలో కరీనా కపూర్, టబులతో కలిసి యాక్ట్ చేసి ఆకట్టుకుంది. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా రీసెంట్ గా ఓ ఈవెంట్ కు హాజరైన కృతి సనన్.. అందులో చెర్రీ రెడ్ బ్రాలెట్ అవుట్ పిట్ లో అదరగొట్టింది. ఆ బ్రాలెట్ ధర రూ.1.79లక్షలు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను నెటిజన్స్ నుంచి తెగ రెస్పాన్స్ కూడా వస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com