Top 10 Heros in Tollywood : టాలీవుడ్ లో కొత్త సర్వే.. టాప్ హీరో ఎవరో తెలుసా..?

Top 10 Heros in Tollywood : టాలీవుడ్ లో కొత్త సర్వే.. టాప్ హీరో ఎవరో తెలుసా..?

ఓర్మాక్స్ మీడియా.. ప్రముఖ మీడియా సంస్థలలో ఇదీ ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులకు సంబంధించి తాజా అప్ డేట్స్ క్రేజీగా అందిస్తుంటుంది. ..సినీ రంగాలలో ఎప్పటికప్పుడు పలు రకాల సర్వేలను సైతం నిర్వహిస్తూ పలు రకాల ఫలితాలతో ఎంటర్ టైన్ చేస్తుంటుంది.

సినీ తారలు వెబ్ సిరీస్ లో సినిమాల గురించి ఇలా పలు రకాల సర్వేలు వైరల్ అవుతుంటాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి జనవరి నెల వరకు సంబంధించిన ఒక టాప్ లిస్టును సైతం ఈ నెలలో విడుదల చేసింది. ఇందులో టాప్ టెన్ -10 తెలుగు హీరోల లిస్టును సైతం విడుదల చేశారు.

ఎప్పటిలాగే ఈసారి కూడా టాప్ వన్ లో ప్రభాస్ (Prabhas) మొదటి స్థానంలో నిలిచారు. గత ఏడాది సలార్ (Salaar) సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రభాస్ స్థానాన్ని ఎవరు కదల్చలేకపోయారు. టాప్-2లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నిలిచారు. మహేశ్ నటించిన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఏ కొత్త సినిమా రిలీజ్ కాకపోయినా అల్లు అర్జున్ (Allu Arjun) టాప్-3లో నిలవడం విశేషం. పుష్ప-2 రిలీజ్ ఇప్పటికీ ఫ్యాన్స్ ను హాంట్ చేస్తూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నాలుగో స్థానంలో నిలిచారు.ఈ ఏడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ (Ram Charan) ఐదవ స్థానంలో ఉన్నారు. ఓజీతో ఎన్నికల ముందు పలకరించనున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరో స్థానంలో ఉన్నారు. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ఏడవ స్థానంలో నిలిచారు. ఎనిమిదవ స్థానంలో ఈగల్ రవితేజ (Raviteja) ఉన్నారు. తొమ్మిదవ స్థానంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఉండగా పదవ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నిలిచారు.

Tags

Read MoreRead Less
Next Story