Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ మూవీ నుంచి మరో ట్రైలర్

Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ మూవీ నుంచి మరో ట్రైలర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ( Kalki 2898 AD ) మూవీ నుంచి మరో ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల వారానికి ముందు ఈ ట్రైలర్ రానున్నట్లు సమాచారం. దీని నిడివి 2.30 నిమిషాలు ఉన్నట్లు టాక్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ విడుదల కానుంది.

ఇక సినిమా విడుదలకి సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ను గట్టిగా చేయబోతుంది మూవీ టీమ్. అందులోనూ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే అక్కడక్కడా డబ్బింగ్ కాస్త బాలేదనే వాదన కూడా ఉంది. కానీ విజువల్స్ విషయంలో మాత్రం ఫ్యాన్స్‌కి ఎలాంటి నిరుత్సాహం లేదు.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామ పాత్రలో అద్భుతంగా కనిపిస్తున్నారు. అలానే కమల్ హాసన్ విలన్ రోల్‌లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్‌లో కేవలం ఒక్క షాట్‌లో మాత్రమే కమల్ కనిపించారు. వీరితో పాటు దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, కీర్తి సురేష్ (బుజ్జి వాయిస్) ఈ చిత్రం కోసం పనిచేశారు.

Tags

Next Story