Prabhas : లక్ అంటే ఇది.. ప్రభాస్ తో ఛాన్స్ కొట్టేసింది!

Prabhas : లక్ అంటే ఇది..  ప్రభాస్ తో ఛాన్స్ కొట్టేసింది!

ప్రభాస్ హీరోగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాల్ తో మ్యాజిక్ సిట్టింగ్స్ కూడా మొద‌ల‌య్యాయ‌ని టాక్‌. కెమెరామెన్‌గా పి.ఎస్‌.వినోద్ నే కొన‌సాగించే అవ‌కాశాలు ఉన్నాయి.

ఈ స్టోరీ ఆర్మీ బ్యాక్ డ్రాప్లో ఉండే ఇంటెన్స్..ఎమోషన్ లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. దిల్రాజు బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్. పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేశారనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

కాగా దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్.. ఆ తర్వాత రాజాసాబ్, సలార్ శౌర్యాంగపర్వం కోసం సిద్ధం కానున్నారు. అటు మృణాల్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రంలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్‌ రూపొందిస్తున్న చిత్రం ఇది. వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story