Kalki : కల్కిలో ప్రభాస్ లేట్ ఎంట్రీ.. ఇదేం రచ్చరా నాయనా..!

Kalki : కల్కిలో ప్రభాస్ లేట్ ఎంట్రీ.. ఇదేం రచ్చరా నాయనా..!

ప్రభాస్ కల్కి సినిమా కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇదో ప్యాన్ వరల్డ్ మూవీ. సైంటిఫిక్ ఫిక్షన్ కథాంశం కావడంతో.. కథ చాలా చెప్పాల్సి ఉంటుంది. కథ ప్రకారమే ప్రధాన పాత్రల ఎంట్రీ ఉంటుంది. అలా.. ప్రభాస్ పాత్ర కొంత లేట్ గా ఎంట్రీ ఇస్తుందనేది లేటెస్ట్ టాక్.

కల్కి తాజా రిపోర్ట్స్ ప్రకారం.. మూవీ మొదలైన పావుగంటకు ప్రభాస్ కనిపిస్తాడట. సలార్ లో కూడా అలాగే జరిగింది. ఐతే.. చిన్నప్పటి ప్రభాస్ ను చాలామంది ఊహించుకోవడంతో నడిచిపోయింది.

ప్రభాస్ కనిపించడానికి ముందు.. సినిమా ప్లాట్ ఎక్స్ ప్లెయిన్ చేయడానికి టైం తీసుకుంటారట. ఐతే.. ప్రభాస్ ఎంట్రీతో ఇక మూవీ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుందట. డైరెక్టర్ వ్యూను బట్టి, కథను బట్టే హీరో ఉండాలి కానీ.. హీరోను బట్టి సినిమా కాదుకదా. అన్నీ కుదిరితే ఇది పెద్ద సమస్య కానేకాదనేది విశ్లేషకుల అభిప్రాయం.

Tags

Read MoreRead Less
Next Story