Kalki : ప్రభాస్ కల్కి కొత్త ప్రయోగం

Kalki : ప్రభాస్ కల్కి కొత్త ప్రయోగం

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కొత్త సినిమా కల్కి (Kalki) ప్రమోషన్ కోసం కొత్త ప్రయోగం చేస్తున్నారు మేకర్స్. సినిమా ప్రచారాన్ని కూడా వ్యాపారంగా మార్చుకొనే టెక్నిక్ ఫాలో అవుతున్నారు. రాజమౌళి సహా.. ప్రముఖ దర్శకుల బాటలో తొలిసారి నాగ్ అశ్విన్ ప్రయాణిస్తున్నారు.

'కల్కి'లో ప్రభాస్ సహా. అమితాబ్ బచ్చన్‌, కమల్ హాసన్‌, దీపికా పదుకొణె లాంటి ప్యాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు. మే 9న విడుదల అనుకున్నా.. రిలీజ్ లేట్ అవుతోంది. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

ఓ ప్రయోగంతో.. రాబోయే ఐదు నెలల్లో ప్రమోషన్ ను స్పీడప్ చేస్తారని టాక్ నడుస్తోంది. మెయిన్ క్యారెక్టర్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా పరిచయం చేయనున్నారు. రాజమౌళి బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాలకు కూడా ఇలాగే చేశారు. అందరూ ఓటీటీలకు అతుక్కుపోవడంతో.. ఈ ఇంట్రొడక్షన్ యానిమేషన్ వీడియోలను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. పాత్రల తీరుతెనుల్ని ప్రేక్షకులకు ముందే తెలిసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కల్కి క్యారెక్టర్ యానిమేషన్ వీడియోల స్ట్రీమింగ్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఆకర్షణీయమైన మొత్తాన్ని చెల్లించినట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story