Prabhas Spirit : ప్రభాస్ స్పిరిట్..క్రేజీ అప్డేట్ ఇచ్చిన వంగా

Prabhas Spirit : ప్రభాస్ స్పిరిట్..క్రేజీ అప్డేట్ ఇచ్చిన వంగా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన 'సలార్' దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించింది. అభిమానులకు ఉత్సాహాన్ని నింపింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్డమ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో 'కల్కి' (Kalki) ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ తర్వాతి చిత్రాల్లో సందీప్ వంగ (Sandeep Vanga) దర్శకత్వం వహిస్తున్న 'స్పిరిట్' సినిమా ఉంది. ఇటీవలే యానిమల్ సినిమాతో సక్సెస్ అందుకున్న సందీప్ ప్రభాస్ తో తీయబోయే చిత్రం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.

ఈ సినిమాను సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తారని సమాచారం. టీసీరీస్, భద్రకాళి సంస్థలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి అప్డేట్స్ తక్కువే అయినప్పటికీ, ఇది వార్ లేదా హారర్ నేపథ్య చిత్రమని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పష్టత ఇచ్చారు దర్శకుడు సందీప్ వంగ. బాలీవుడ్ లో ఓ వేడుకలో పాల్గొన్న ఆయన 'స్పిరిట్' సినిమాపై వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇది హారర్ సినిమా కాదని చెబుతూ ఒక నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ కథని చెప్పారు. ప్రస్తుతం స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టుగా తెలియజేశారు. ఏ భాషలో అయినా హీరోలు పోలీసు పాత్రల్లో నటిస్తే అభిమానులకు నచ్చుతుంది. దాదాపు అందరు హీరోలు ఇలా నటించి సక్సెస్ సాధించినవారే. కొత్తతరం దర్శకుడైన వంగా .. ప్రభాస్ ను ఏ విధంగా చూపిస్తారనేది ఆసక్తిగా మారింది.a

Tags

Read MoreRead Less
Next Story