Kalki : ఐపీఎల్ లో ప్రత్యక్షమైన కల్కి
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2829 AD . జూన్ లో రిలీజ్ కు రెడీ అయిన కల్కి ప్రమోషన్లు మొదలుపెట్టారు మేకర్స్. ప్రభాస్ కల్కి గెటప్ లో ఐపీఎల్ లో ప్రత్యక్షం కావడం ప్రత్యేకత సంతరించుకుంది. కల్కి సైన్స్ ఫిక్షన్ మూవీ. హీరో కథలో భాగంగా కాలంలో ప్రయాణిస్తాడు. ముఖ్యంగా భవిష్యత్ లో ప్రపంచం ఎలా ఉంటుందో నాగ్ అశ్విన్ గొప్పగా తెరకెక్కించారట. ఫ్యూచర్ వరల్డ్ మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తామని నాగ్ అశ్విన్ ధీమాగా చెబుతున్నాడు.
కల్కి విజయం పై ఆయన విశ్వాసంతో ఉన్నారు మేకర్స్. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సమ్మర్ కానుకగా మే 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్ 27 కి వాయిదా పడింది. మెగా ఈవెంట్ ఐపీఎల్ వేదికగా కల్కి చిత్రాన్ని ప్రమోట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
కల్కి చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ. సదరు భైరవ గెటప్ లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. మే 3న ముంబై-కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ని ప్రమోట్ చేస్తున్నాడు ప్రభాస్. ఈ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com